OnePlus Nord CE 3 lite: రూ. 20 వేలలో వన్‌ప్లస్‌ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. 108 ఎంపీ కెమెరా..

|

Apr 06, 2023 | 5:14 PM

మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకొచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ వన్‌ప్లన్.. ఇటీవీల వరుసగా బడ్జెట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ తాజాగా మరో స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌ పేరుతో ఈ ఫోన్‌ను ఇటీవలే...

OnePlus Nord CE 3 lite: రూ. 20 వేలలో వన్‌ప్లస్‌ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. 108 ఎంపీ కెమెరా..
Nord Ce 3 Lite
Follow us on

మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకొచ్చిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ వన్‌ప్లన్.. ఇటీవీల వరుసగా బడ్జెట్‌ ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు బడ్జెట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌ తాజాగా మరో స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌ పేరుతో ఈ ఫోన్‌ను ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి తొలి సేల్‌ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు, అమెజాన్‌లో ఈ ఫోన్‌ సేల్‌కు రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 1,080×2,400 పిక్సెల్స్‌తో కూడిన 6.72 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి ఈ స్క్రీన్‌ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆక్సిజన్‌ 13.1తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్యాటరీకి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 67W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే.. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 19,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది. కొనుగోలు చేసే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై రూ. 1000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..