OnePlus Nord: ఆక‌ట్టుకుంటోన్న వ‌న్‌ప్ల‌స్ కొత్త ఫోన్ ఫీచ‌ర్లు.. విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన ధ‌ర‌.. ఎంతంటే..

|

Jun 08, 2021 | 2:43 PM

OnePlus Nord CE 5G: వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ నుంచి కొత్త ఫోన్ వ‌స్తుందంటే అంద‌రి చూపులు అటుగా మ‌ళ్లుతాయి. ముఖ్యంగా భార‌త్‌లో...

OnePlus Nord: ఆక‌ట్టుకుంటోన్న వ‌న్‌ప్ల‌స్ కొత్త ఫోన్ ఫీచ‌ర్లు.. విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన ధ‌ర‌.. ఎంతంటే..
One Plus Nord Ce 5g
Follow us on

OnePlus Nord CE 5G: వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ నుంచి కొత్త ఫోన్ వ‌స్తుందంటే అంద‌రి చూపులు అటుగా మ‌ళ్లుతాయి. ముఖ్యంగా భార‌త్‌లో వ‌న్‌ప్ల‌స్‌కు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ ఫోన్‌లోని కెమెరా, ప్రాసెస‌ర్ స్పీడ్ మొబైల్ ల‌వ‌ర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక మొద‌టి నంచి ఎక్కువ బ‌డ్జెట్‌లో ఫోన్ల‌ను తీసుకొచ్చిన వ‌న్‌ప్ల‌స్ తాజాగా బ‌డ్జెట్ ఫోన్ల‌పై దృష్టిసారించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా టెక్ మార్కెట్లోకి వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. జూన్ 10న అంటే మ‌రో రెండు రోజుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ నేప‌థ్యంలోనే రెండు రోజుల ముందే ఈ ఫోన్ ఫీచ‌ర్ల‌తో పాటు, ధ‌ర వివ‌రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మ‌రి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచ‌ర్ల‌తో పాటు ధ‌ర వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

* ఈ ఫోన్ ద్వారా రూ. 22,999 ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఈ బ్రాండ్ నుంచి వ‌చ్చిన ఫోన్ల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ‌. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగ‌దారుల‌కు మ‌రో రూ. 1000 క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఆఫ‌ర్ జూన్ 11 నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

* ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ అందివ్వ‌నున్నారు.

* ఇక 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చ‌ని అంచ‌నా.
* ఇక కెమెరా విష‌యానికొస్తే.. ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరా ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

* ఇక 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ అందించ‌నున్న‌ట్లు ఆన్‌లైన్‌లో లీక్ అయిన స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో ఒంటరి మహిళపై దుండ‌గుల అత్యాచారయత్నం.. ఆమె గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో

Fake Apps: మీ ఫోన్లలో ఈ యాప్స్‌ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్‌ ఖాతాలోని సొమ్ము కల్లాస్ అవడం ఖాయం..

Google fined: గూగుల్‌కు భారీ షాక్.. రూ.1,951 కోట్ల ఫైన్​.. ఎవరు వేశారో తెలుసా..