Ola Electric Scooter: ఓలా స్కూటర్ రైడ్‌ ఇప్పుడు మరింత ఖరీదు..!

|

Mar 19, 2022 | 5:47 AM

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ రైడ్‌ ఇప్పుడు మరింత ఖరీదుగా మారింది. కంపెనీ ఓలా ఎస్1 ప్రో ధరని పెంచింది. ప్రస్తుతం దీని ధర రూ.129,999 లక్షలు.

Ola Electric Scooter: ఓలా స్కూటర్ రైడ్‌ ఇప్పుడు మరింత ఖరీదు..!
Ola Electric Scooter
Follow us on

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ రైడ్‌ ఇప్పుడు మరింత ఖరీదుగా మారింది. కంపెనీ ఓలా ఎస్1 ప్రో ధరని పెంచింది. ప్రస్తుతం దీని ధర రూ.129,999 లక్షలు. కానీ మార్చి 18 తర్వాత స్కూటర్ ధరను పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. కస్టమర్‌లు ఈ స్కూటర్‌ను ఓలా యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయగలరన్న సంగతి తెలిసిందే. Ola S1 ప్రో కొత్త ఆర్డర్‌ల పంపిణీ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. ఇది నేరుగా వినియోగదారుల ఇళ్లకు డెలివరీ అవుతుందని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా కంపెనీ తన స్కూటర్లకు కొత్త అప్‌డేట్‌లను కూడా ప్రకటించింది. MoveOS 2.0 నవీకరణతో కొత్త ఫీచర్లను జోడిస్తుంది. Ola S1 ప్రో స్కూటర్‌లో కంపెనీ 8.5kW బ్యాటరీని అందించింది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. సాధారణ, స్పోర్ట్స్‌, హైపర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఇది కేవలం 3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 181 కిమీ పరిధిని అందించగలదని కంపెనీ పేర్కొంది.

ఫీచర్లు

ఫీచర్ల గురించి చెప్పాలంటే క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ‘టేక్ మీ హోమ్’ లైట్లతో పాటు రిమోట్ స్టార్ట్/స్టాప్, లాక్/అన్‌లాక్ వంటి ప్రీమియం ఫీచర్లు S1 ప్రోలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ స్కూటర్ రెండు చక్రాలలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించింది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు రెండూ ఉన్నాయి. స్కూటర్ 36-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ను పొందుతుంది. ఇది రెండు ఓపెన్-ఫేస్డ్ హెల్మెట్‌లను సౌకర్యవంతంగా ఉంచుతుంది.

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..