Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్‌ యాక్సెస్‌ చేసుకునే అవకాశం..

|

Jun 28, 2022 | 7:46 AM

Gmail: ప్రస్తుతం మెయిల్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఉద్యోగుల నుంచి మొదలు విద్యార్థుల వరకు అందరూ మెయిల్స్‌ ఉపయోగిస్తున్నారు. అయితే మెయిల్స్‌ను యాక్సెస్‌ చేయాలంటే...

Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్‌ యాక్సెస్‌ చేసుకునే అవకాశం..
Follow us on

Gmail: ప్రస్తుతం మెయిల్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఉద్యోగుల నుంచి మొదలు విద్యార్థుల వరకు అందరూ మెయిల్స్‌ ఉపయోగిస్తున్నారు. అయితే మెయిల్స్‌ను యాక్సెస్‌ చేయాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉండాలనే విషయం తెలిసిందే. మరి ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని చోట కూడా మెయిల్స్‌ చెక్‌ చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది. యూజర్లకోసం గూగుల్‌ ఇలాంటి ఫీచర్‌నే అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీంతో ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ సేవలను పొందే అవకాశం కల్పించనున్నారు. ఇంటర్నెట్ సదుపాయం లేని చోట కూడా మెయిల్స్‌ చదవడం, రిప్లై ఇవ్వొచ్చు. అయితే ఈ సేవలను కేవలం క్రోమ్‌ బ్రౌజర్‌లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా జీమెయిల్‌ ఆఫ్‌లైన్‌ సేవలను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని స్టెప్స్‌ ఫాలో కావాల్సి ఉంటుంది..

* ఇందుకోసం ముందుగా క్రోమ్‌ బ్రౌజర్‌లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉన్న సమయంలోనే mail.google.comను బుక్‌ మార్క్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* అనంతరం జీమెయిల్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లో ‘ఆల్‌ సెట్టింగ్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత ఆఫ్‌లైన్‌ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్‌ ఉంటుంది.

* తర్వాత ఈ-మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ చేయాలని కోరుతుంది. ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకొని సేవ్‌ ఛేంజస్‌పై క్లిక్ చేసి జీమెయిల్ ఆఫ్‌లైన్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..