Nothing Phone (2): సూపర్ ప్రాసెసర్‌తో నథింగ్ కొత్త ఫోన్.. స్నాప్ డ్రాగన్ ప్రతినిధి చెప్పిన విశేషాలు వింటే షాకవుతారు..

| Edited By: Janardhan Veluru

Mar 09, 2023 | 10:57 AM

క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ అనుకోకుండా నథింగ్ ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని వెల్లడించారు. ఇది వన్ ప్లస్ 11ఆర్2కి కూడా శక్తినిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో నడిచే నథింగ్ ఫోన్ (1)తో పోలిస్తే పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది.

Nothing Phone (2): సూపర్ ప్రాసెసర్‌తో నథింగ్ కొత్త ఫోన్.. స్నాప్ డ్రాగన్ ప్రతినిధి చెప్పిన విశేషాలు వింటే షాకవుతారు..
Nothing
Follow us on

భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇటీవల తన ఫోన్‌తో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న నథింగ్ కంపెనీ ప్రస్తుతం మరో కొత్త ఫోన్‌ను(Nothing Phone (2)) మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది ఇందులో కొత్త విషయం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఫోన్ గురించి ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ అనుకోకుండా నథింగ్ ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని వెల్లడించారు. ఇది వన్ ప్లస్ 11ఆర్2కి కూడా శక్తినిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో నడిచే నథింగ్ ఫోన్ (1)తో పోలిస్తే పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. నథింగ్, వారి తదుపరి స్మార్ట్‌ఫోన్‌ను నథింగ్ ఫోన్ (2) అని పిలుస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2023లో, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ చిప్‌సెట్ నథింగ్ ఫోన్‌కు శక్తినిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.  

డిజైన్, బిల్డ్ క్వాలిటీ

ప్రస్తుతం నథింగ్ ఫోన్ 1 లో గ్లిఫ్ డిజైన్‌ను అందిస్తున్నారు. నథింగ్ ఫోన్ (2)లో కూడా ఈ విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నారు. అయితే స్పెసిఫికేషన్లు మాత్రం గణనీయంగా మారవచ్చని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2 మొదటి వెర్షన్ కంటే ప్రీమియంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఇచ్చే అధునాతన ఫీచర్ల వల్లే ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఈ ఏడాదిలో లాంఛ్..

నథింగ్ ఫోన్ (2) ప్రపంచవ్యాప్తంగా 2023 మూడో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటుననాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ ఏA065 అని లీకులు చెబుతున్నాయి. అలాగే ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వినియోగదారులను అలరించనుంది. అయితే ఈ ఫోన్ మొదటగా యూఎస్ మార్కెట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..