Nokia G42 5G: నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్.. దీనికి సర్వీస్ సెంటర్‌తో పనే లేదు.. పూర్తి వివరాలు ఇవి..

|

Jul 01, 2023 | 5:00 PM

ప్రస్తుతం ఉన్న 5జీ ట్రెండ్ ను అందిపుచ్చుకుంటూ నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించింది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే వినియోగదారుడే ఏ రిపేరు అయినా చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం ఐఫిక్సిట్ తో నోకియా ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

Nokia G42 5G: నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్.. దీనికి సర్వీస్ సెంటర్‌తో పనే లేదు.. పూర్తి వివరాలు ఇవి..
Nokia G42 5g
Follow us on

నోకియా.. ఒకప్పుడు సెల్ ఫోన్ల రంగంలో రారాజుగా వెలుగొందింది. ఆండ్రాయిడ్ రాకతో బ్రాండ్ దాదాపు కనుమరుగయ్యిందనే చెప్పాలి. శామ్సంగ్ గేలాక్సీ ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రభంజనంలో నోకియా ఫోన్ల వైపు చూసే వారు కూడా కరువయ్యారు. ఆ తర్వాత మేల్కోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లు లాంచ్ చేసినా అవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న 5జీ ట్రెండ్ ను అందిపుచ్చుకుంటూ నోకియా జీ42 5జీని ఆవిష్కరించింది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే వినియోగదారుడే ఏ రిపేరు అయినా చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం ఐఫిక్సిట్ తో నోకియా ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నోకియా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్విక్ ఫిక్స్ రిపేరబులిటీ..

నోకియా జీ42 5జీ ఫోన్లో ప్రత్యేకమైన అంశందాని క్విక్‌ఫిక్స్ రిపేరబిలిటీ. పగిలిన స్క్రీన్‌లు, పనికిరాని బ్యాటరీలు, ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి దెబ్బతిన్న భాగాలను సులభంగా మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అది కూడా వినియోగదారులే మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అందుకోసం ఐఫిక్సిట్ తో నోకియా ఒప్పందం చేసుకొని సరసమైన ధరలకే రీప్లేస్‌మెంట్ పార్ట్‌లు ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.

నోకియా జీ42 5జీ ధర, లభ్యత..

నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ యూరోప్ లో మొదటిగా లాంచ్ అయ్యింది. అక్కడ దీని ధర 199జీబీపీ అంటే మన కరెన్సీలో రూ. 20,635 వరకూ ఉంటుంది. పర్పుల్ కలర్ లో అందుబాటులో ఉంటోంది. నోకియా ఆన్ లైన్ స్టోర్ లో యూకే అలాగే కొన్ని ఎంపిక చేసిన రీజియన్లలో అమ్మకాలు చేస్తోంది. మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

నోకియా జీ42 5జీ స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన క్విక్‌ఫిక్స్ డిజైన్‌ను కలిగి ఉంది. 65% రీసైకిల్ మెటీరియల్‌లతో కూడిన వెనుక ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. 720×1612 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.56-అంగుళాల హెచ్ డీ+ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. స్క్రీన్‌ను రక్షించడానికి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్‌తో ఇది వస్తుంది. 6జీబీ ర్యామ్ తో పాటు మరో 5జీబీ వర్చువల్ ర్యామ్ అంటే మొత్తం 11జీబీ ర్యామ్ ఉంటుంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి 1టీబీ వరకు విస్తరించవచ్చు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న నోకియా డివైస్ కోసం రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లను అందజేస్తానని హామీ ఇచ్చింది. ఫోన్ వెనుక వైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన దాని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో కెమెరా ఔత్సాహికులు అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. సెల్ఫీల కోసం నైట్ మోడ్‌తో కూడిన 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఇది ఐపీ62 రేటింగ్‌ను కలిగి ఉంది. తద్వారా నీరు, ధూళి నిరోధకతను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..