Asteroid: అంతా మాయం..! భూమివైపు దూసుకొస్తున్న మహాముప్పు.. ప్రపంచానికి నాసా అలర్ట్
దూసుకొస్తున్న మహాముప్పు.. యుగాంతం తప్పదు..! అంతా మాయం.. అంటూ ఇప్పటికే ఎన్నో వైరల్ న్యూస్‌లు విన్నారు. అలానే.. భూమి అంతం అయిపోతుందని.. డేట్ ఫిక్స్ చేసి మరీ.. ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఎర్త్ ఎండ్‌పై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి. కానీ.. ఇప్పటి వరకూ ఏదీ నిజం కాలేదు. అయితే.. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్ మాత్రం..

దూసుకొస్తున్న మహాముప్పు.. యుగాంతం తప్పదు..! అంతా మాయం.. అంటూ ఇప్పటికే ఎన్నో వైరల్ న్యూస్‌లు విన్నారు. అలానే.. భూమి అంతం అయిపోతుందని.. డేట్ ఫిక్స్ చేసి మరీ.. ఎంతో మంది ఎన్నో చెప్పారు. ఎర్త్ ఎండ్‌పై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి. కానీ.. ఇప్పటి వరకూ ఏదీ నిజం కాలేదు. అయితే.. భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్ మాత్రం.. ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతునే ఉన్నాయి. తాజాగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ -NASA శాస్త్రవేత్తలు 2024 YR4 అనే ఉల్క (ఆస్ట్రాయిడ్) ను కనుగొన్నారు.. ఇది 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని.. నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ భారీ గ్రహశకలం భూమివైపు దూసుకువస్తోందని.. దీని పరిమాణం సుమారుగా ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు. ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని.. భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. 2032లో భూమిని ఢీకొట్టవచ్చని అంచనావేశారు. అబు దాబీలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ (IAC) ప్రకారం.. 2024 YR4 అనే కోడ్ నేమ్ కలిగిన ఈ గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుంది. అప్పుడే ఢీకొట్టే ఛాన్స్ ఉంటుందని అంచనా వేశారు.
దీని ప్రభావం 83లో 1:83గా ఉంటుంది.. అంటే 83లో ఒక్కశాతం అని అర్ధం.. గ్రహశకలం.. 130 నుండి 300 అడుగుల పొడవుతో ఉందని.. మానవజాతి అంతరించిపోయే ప్రమాదమేమి ఉండదని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.. అయితే, ఈ గ్రహశకలం ఒక ప్రధాన నగరాన్ని ఢీకొంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం 8 మెగాటన్‌ల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుంది. జపాన్‌లోని హిరోషిమాను నిర్మూలించిన అణు బాంబు శక్తి కంటే 500 రెట్లు ఎక్కువ.. అని వివరించారు.
ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకి చెందిన ఆస్ట్రారాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం (ATLAS) కనిపెట్టింది. NASA ప్రకారం.. భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలం శాస్త్రీయ విశ్లేషణ ద్వారా 2024 YR4గా గుర్తించారు.. ఇది డిసెంబర్ 22, 2032న భూమిపై ప్రభావం చూపే అవకాశం 1% కంటే ఎక్కువ ఉందని సూచిస్తుంది.. అంటే ఈ గ్రహశకలం ప్రభావం 99% ప్రభావం చూపే అవకాశం లేదని అర్థమవుతుందని పేర్కొన్నారు. ఇది ప్రారంభ విశ్లేషణ మాత్రమే.. మరిన్ని పరిశీలనలు అనంతరం ఇది కాలక్రమేణా మారే అవకాశం ఉంది. కావున.. అంచనా మారే అవకాశం ఉంది.
IAC రిపోర్ట్ ప్రకారం.. ఈ గ్రహశకలం 2024 డిసెంబర్ 25న భూమికి దగ్గరగానే వచ్చింది. ఇది డిసెంబర్ 17, 2028లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు.. అప్పుడు కూడా ఈ ఉల్కా భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువేనని పేర్కొంటున్నారు. కానీ.. 2032 డిసెంబర్ 22న మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందని.. ఆ సమయంలో ఢీకొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి ఈ గ్రహశకలం భూమి పక్క నుంచి వెళ్తుంది.. అలా వెళ్లి వచ్చిన ప్రతిసారీ ఇది భూమికి మరింత చేరువకు వస్తుందని నిపుణులు తెలిపారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..