AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme C 53: రియల్‌ మీ నుంచి నయా స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌.. ఫొటో లవర్స్‌కు పండగే

తాజాగా భారతదేశంలో ఆదరణ పొందిన రియల్‌ మీ కంపెనీ తన సీ సిరీస్‌ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ సీ -53 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ ఫాస్ట్‌ చార్జ్‌ సపోర్ట్‌ రానుంది. అలాగే రియల్‌మీ డైనమిక్ ర్యామ్‌ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12 జీబీ వరకు విస్తరించవచ్చు.

Realme C 53: రియల్‌ మీ నుంచి నయా స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌.. ఫొటో లవర్స్‌కు పండగే
Real Me C 53
Nikhil
|

Updated on: Jul 20, 2023 | 6:15 PM

Share

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ విపరీతంగా పెరుగుతుంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత మొబైల్‌ వాడకం తారాస్థాయికి చేరుకుంది. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కంపెనీలు కూడా భారతదేశంలో మార్కెట్‌ పెంచుకోవడానికి వారికి అందుబాటులో ఉండే ధరల్లో స్మార్ట్‌ ఫోన్లు లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో ఆదరణ పొందిన రియల్‌ మీ కంపెనీ తన సీ సిరీస్‌ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ సీ -53 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఫోన్‌ ఫాస్ట్‌ చార్జ్‌ సపోర్ట్‌ రానుంది. అలాగే రియల్‌మీ డైనమిక్ ర్యామ్‌ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12 జీబీ వరకు విస్తరించవచ్చు. రియల్‌ మీ 53 4 జీబీ + 128 జీబీ వేరింయట్‌ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. అలాగే 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌ ఉన్న ధర రూ.10,999గా ఉంటుంది. ఈ ఫోన్‌ జూలై 26 నుంచి ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో జూలైన 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 

రియల్‌ మీ సీ 53 స్పెసిఫికేషన్స్ ఇవే 

ఈ ఫోన్‌ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా పని చేసే రియల్‌ మీ యూఐ ఎడిషన్‌తో వస్తుంది.  అలాగే 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెచ్‌జెడ్‌ టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఇది 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అలాగే  ఏఆర్‌ఎం మలీ-జీ 57తో ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లోని ర్యామ్‌ను వర్చువల్‌గా 12 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌ 108  మెగాపిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇది మైక్రో ఎస్‌డీ కార్డ్ (2 టీబీ వరకు) ద్వారా విస్తరించదగిన 128 జీబీ వరకు ఆన్‌బోర్డ్ నిల్వను అందిస్తుంది. టైప్‌ సీ చార్జింగ్‌ పోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతునిచ్చేలా 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us