Samsung Smartwatch: లాంచింగ్‌కు ముందే ఫీచర్లు లీక్.. శామ్సంగ్ కొత్త స్మార్ట్ వాచ్ మామూలుగా లేదుగా..

|

Jun 24, 2023 | 3:00 PM

శామ్సంగ్ గేలాక్సీ వాచ్ 6, గేలాక్సీ వాచ్ 6 క్లాసిక్ పేరుతో వీటిని 2023 జూలై లో నిర్వహించే అన్ ప్యాక్డ్ గేలాక్సీ ఈవెంట్ లో ఆవిష్కరించాలని నిర్ణయించింది. అయితే అంతకన్నా ముందే ఈ గేలాక్సీ వాచ్ 6 సిరీస్కు సంబంధించిన కొన్ని ఫీచర్లు,స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Samsung Smartwatch: లాంచింగ్‌కు ముందే ఫీచర్లు లీక్.. శామ్సంగ్ కొత్త స్మార్ట్ వాచ్ మామూలుగా లేదుగా..
Galaxy Watch 6
Follow us on

శామ్సంగ్.. మన దేశంలో ఈ బ్రాండ్ తెలియని వారుండరే అతిశయోక్తి కాదేమో! స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాల వరకూ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే బ్రాండ్ నుంచి స్మార్ట్ వాచ్ లు కూడా పెద్ద సంఖ్యలోనే లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో సిరీస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ రెడీ అయ్యింది. శామ్సంగ్ గేలాక్సీ వాచ్ 6, గేలాక్సీ వాచ్ 6 క్లాసిక్ పేరుతో వీటిని 2023 జూలై లో నిర్వహించే అన్ ప్యాక్డ్ గేలాక్సీ ఈవెంట్ లో ఆవిష్కరించాలని నిర్ణయించింది. అయితే అంతకన్నా ముందే ఈ గేలాక్సీ వాచ్ 6 సిరీస్కు సంబంధించిన కొన్ని ఫీచర్లు,స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ట్విట్టర్ లో షేర్..

టిప్ స్టర్ అహ్మద్ క్వైడర్ లీక్ అయిన గేలాక్సీ వాచ్ 6 బ్యాటరీ సామర్థ్యాలతో పాలు కొన్ని వివరాలను ట్విట్టర్ లో షేర్ చేశారు. గేలాక్సీ వాచ్ 6 సిరీస్ లో పోయిన ఏడాది విడుదలైన గేలాక్సీ వాచ్ 5 కన్నా 20శాతం అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఉంటాయి. లీకైన సమాచారం ప్రకారం 40ఎంఎం గేలాక్సీ వాచ్ 6లో 300ఎంఏహోచ్, 44ఎంఎం ప్యాక్ లో 425ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. అదే విధంగా 43ఎంఎం గేలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 300ఎంఏహెచ్, 47ఎంఎం గేలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 425ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాక 20 శాతం పెద్ద పరిమాణంలో గేలాక్సీ వాచ్ లు ఉంటాయని టిప్ స్టర్ పేర్కొన్నారు.

టిప్ స్టర్ పేర్కొన్న దాని ప్రకారం ఈ గేలాక్సీ వాచ్ 6 గ్రాఫైట్ గోల్డ్, గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. గేలాక్సీ వాచ్ 6 క్లాసిక్ గ్రాఫైట్ సిల్వర్ రంగులో ఉంటుంది. దీనిలో డబ్ల్యూ930 ప్రాసెసర్ ఉంటుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ధర విషయానికి వస్తే ఫ్రాన్స్ లో గేలాక్సీ వాచ్ 6 ధర 319 యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 26,600 ఉంటుంది. అలాగే గేలాక్సీ 6 వాచ్ క్లాసిక్ ధర వచ్చేసి 419 యూరోలు, అంటే రూ. 37,600 ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..