
14 ఏళ్ల క్రితం ఇండియాలో ఓ మిడ్ సైజ్ SUV లాంచ్ అయింది. అప్పట్లో అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోడ్లపై మెరుపువేగంతో దూసుకెళ్తూ, స్టైలిష్ లుక్‌తో కార్లను ఇష్టపడే వారికి విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ఓ 4 ఏళ్ల క్రితం ఇండియాలో దాన్ని నిలిపివేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కార్ తిరిగి వస్తోంది. ఇండియలో కొత్త లుక్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇంతకీ ఆ కార్ ఏంటంటే.. రెనాల్ట్ డస్టర్. తాజాగా రెనాల్ట్ కంపెనీ తమ థర్డ్ జనరేషన్ డస్టర్‌ను ఆవిష్కరించింది. త్వరలోనే దీన్ని ఇండియాలో లాంచ్ చేయనున్నారు.
మొదట 2012లో రెనాల్ట్ కంపెనీ డస్టర్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. 2022లో నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ అదిరిపోయే లుక్‌లో తిరిగి వస్తోంది. 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఆవిష్కరించబడిన ఈ సరికొత్త డస్టర్ సూపర్ ఫీచర్లతో అంతర్జాతీయ గేమ్ ప్లాన్ 2027 కింద రెనాల్ట్ రీబిల్డ్ చేసి ఇండియాలో వదులుతోంది.
కొత్త డస్టర్ కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు రూ.21,000 వద్ద ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి ధరలను కంపెనీ ప్రకటించలేదు. టర్బో-పెట్రోల్ వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయి. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ సంవత్సరం చివరిలో, దీపావళి పండుగ సీజన్లో వస్తుంది.
ఇండియాలో లెవెల్ 2 ADASను అందించే మొట్టమొదటి రెనాల్ట్ మోడల్‌గా కొత్త డస్టర్ అవతరించడంతో భద్రతలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. ఈ వ్యవస్థలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి