ప్రస్తుతం భారతదేశంలోని టెలికాం మార్కెట్‌లో 5జీ ఫీవర్ నడుస్తుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు కొన్ని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నాయి. 4జీ ధరలకే వినియోగదారులు 5జీ డేటా వస్తుంది. అయితే ఈ రెండు నెట్‌వర్క్‌ల నుంచి గట్టి పోటీను ఎదుర్కొంటున్న వోడాఫోన్ ఐడియా డేటా రోల్ ఓవర్ ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అలాగే పత్యర్థుల నుంచి కూడా కొత్త ప్యాక్‌ల పోటీను తట్టుకునేలా వీఐ కూడా సరికొత్త ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ప్రస్తుత కస్టమర్లకు ఉత్తమమైన విలువను అందించడానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలి లాంచ్‌లో, వీఐ డేటా, వాయిస్, మరిన్ని ప్రయోజనాలను అందిస్తూ రూ. 181 ధరతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఓ 4 జీ డేటా వోచర్ ప్లాన్. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు జోడింపుగా ఈ ప్లాన్‌లోని ప్రయోజనాలను మనం ఆనందించవచ్చు. ఎక్కువగా డేటా వాడే వినియోగదారులను టార్గెట్ చేస్తూ వీఐ ఈ ప్లాన్‌ను అందుబాటులో తీసువచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అందే ప్రయోజనాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
రూ.181 ప్లాన్ అనేది డేటా ప్లాన్. అంటే ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు అదనంగా డేటా కోసం ఈ ప్లాన్ వినియోగదారులు వాడుకోవచ్చు. ఇప్పటికే చాలా డేటా వోచర్‌లు బండిల్ చేసేలా డేటాను అందజేస్తుండగా వీఐ కొత్తగా ప్రారంభించిన 181 డేటా వోచర్ ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ రోజువారీ డేటాను అందిస్తోంది. 1 జీబీ అయిపోయిన తర్వాత, అది మరుసటి రోజుకు మళ్లీ రీసెట్ అవుతుంది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్‌తో అందించిన రోజువారీ డేటాను ఖాళీ చేసే వినియోగదారుల కోసం ప్లాన్ రూపొందించారు. కాబట్టి రూ.181తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు మరిన్ని 4జీ డేటా ప్రయోజనాలను పొందుతారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.