భారతదేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరిగింది. అలాగే విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కూడా పెరిగాయి. దీంతో క్రమేపి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగింది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ పెరిగిన వినియోగాన్ని బట్టి కొత్త మోడల్స్ ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్‌ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లపై వినియోగదారులు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ తయారీ సంస్థ అయిన ఇన్‌ఫినిక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ తయారీలో ముందు ఉంది. తక్కువ ధరకే స్లిమ్ ల్యాప్‌టాప్‌లను రూపొందిచడంతో యువత ఈ ల్యాప్‌టాప్స్‌పై ఆసక్తి కనబురుస్తున్నారు. తాజాగా ఇన్‌ఫినిక్స్ కంపెనీ సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్ 2 పేరుతో రిలీజ్ చేసిన ఈ సనన్ని ల్యాప్‌టాప్ కచ్చితంగా వినియోగదారుల ఆదరాభిమానాలను పొందుతుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 11వ జెనరేషన్ ఐ 7 ప్రాసెసర్‌తో వస్తుంది. అల్యూమినియం అల్లాయ్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ బ్లాక్‌లీట్ కీ బోర్డ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంది. ఇన్‌ఫినిక్స్ ఇన్‌బుక్ ఎక్స్ 2 ల్యాప్‌టాప్ ధర, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఇన్‌ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్ 2 స్లిమ్ ల్యాప్‌టాప్ 1080×1920 పిక్సెల్ రిజుల్యూషన్‌తో 14 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. ల్యాప్‌టాప్ 11వ తరం ఇంటెల్ కోర్ ఐ3, ఇంటెల్ కోర్ ఐ5, ఐ 7 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ 8జీబీ/16జీబీ ర్యామ్‌తో వస్తుంది. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. వీడియో కాలింగ్ కోసం డ్యుయల్ స్టార్ ఎల్ఈడీ ఫిల్ లైట్‌తో హెచ్‌డీ వెబ్ క్యామ్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ స్టీరియో స్పీకర్లతో డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్‌తో కూడిన రెండు డిజిటల్ మైక్రో ఫోన్లతో వస్తుంది. 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..