AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్​ & బ్లాక్​ లుక్‌లో అదరగొడుతున్న Hyundai కొత్త SUV.. ఫీచర్లు, ధర మతిపోగొట్టేస్తాయ్

కొత్త SUV కొనాలని చూస్తున్నవారికి హ్యుందాయ్ (Hyundai) నుంచి మరో ఆసక్తికరమైన మోడల్ రాబోతోందనే వార్త వినిపిస్తోంది. Hyundai Bayon పేరుతో వస్తున్న ఈ SUVకి సంబంధించిన స్పై ఫొటోలు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. ఫైరీ రెడ్‌ కలర్‌తో పాటు బ్లాక్ రూఫ్‌ కలయికలో కనిపించిన ఈ కారు స్పోర్టీ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. అందించిన సమాచారం ప్రకారం, ఈ SUVని 2026 అక్టోబర్ 26న అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే లాంచ్ తేదీ, భారత మార్కెట్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

రెడ్​ & బ్లాక్​ లుక్‌లో అదరగొడుతున్న Hyundai కొత్త SUV.. ఫీచర్లు, ధర మతిపోగొట్టేస్తాయ్
New Hyundai Bayon Suv
Nikhil
|

Updated on: Oct 21, 2026 | 6:50 AM

Share

Hyundai Bayonలో స్టైలిష్ ఎక్స్‌టీరియర్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, పెట్రోల్ ఇంజిన్, పలు భద్రతా ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. క్యాబిన్‌లో రెండు పెద్ద డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి సదుపాయాలు ఈ SUVపై ఆసక్తిని పెంచుతున్నాయి. అంచనా ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. అయితే ఈ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

రెడ్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌లో స్పోర్టీ డిజైన్‌!

Hyundai Bayon ముందు భాగంలో బోనెట్ అంచు వెంట LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), నిలువుగా అమర్చిన లైటింగ్ ఎలిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ప్రధాన హెడ్‌ల్యాంప్స్‌ను బంపర్ దిగువ భాగంలో అమర్చినట్లు స్పై ఫొటోలు సూచిస్తున్నాయి. సిల్వర్ స్కిడ్ ప్లేట్ తరహా డిజైన్ ముందు భాగానికి స్పోర్టీ రూపాన్ని అందిస్తోంది.

సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ రూఫ్‌, రూఫ్ రైల్స్‌, వీల్ ఆర్చ్ క్లాడింగ్‌, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌, రూఫ్ స్పాయిలర్‌, Bayon పేరుతో కూడిన టెయిల్‌గేట్ డిజైన్ ఉండనున్నట్లు సమాచారం.

క్యాబిన్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చని తెలుస్తోంది. క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌, రెండు USB-C పోర్టులు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌, 12V పవర్ అవుట్‌లెట్ వంటి సదుపాయాలు కూడా అందించనున్నట్లు సమాచారం.

1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌..

భారత మార్కెట్ కోసం Hyundai Bayonలో 1.5 లీటర్‌, నాలుగు సిలిండర్ల MPi పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంజిన్ 115 PS పవర్‌, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు IVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండవచ్చని సమాచారం.

భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్లలో లెవల్-2 ADAS సదుపాయాన్ని కూడా అందించవచ్చనే అంచనాలున్నాయి. అయితే వేరియంట్‌ను బట్టి ఫీచర్లలో మార్పులు ఉండవచ్చు.

ధర విషయానికి వస్తే, ఈ SUV ప్రారంభ ధర సుమారు రూ.9 లక్షలుగా ఉండవచ్చని, టాప్ వేరియంట్ ధర రూ.15 లక్షల వరకు చేరవచ్చని అంచనా. బుకింగ్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్లోకి వస్తే Hyundai Bayonకు మారుతి సుజుకి విక్టోరిస్‌, హోండా ఎలివేట్ వంటి మోడళ్ల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Follow Us