
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా వారి అవసరాలను గుర్తించి కొత్త అప్ డేట్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్ వెబ్ వినియోగదారులకు ఓ నూతన ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్ ను డెస్క్ టాప్ లో వాడాలంటే ఫోన్ నుంచి సిస్టమ్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఫోన్ మన దగ్గర లేకపోయినా, లేదా ఫోన్ పాడయినా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సాప్ క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ స్కానింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది.
ఇకపై మీ ఫోన్ నంబర్ ఆధారంగానే వెబ్ లాగిన్ చేసే అవకాశం ఉంటుంది. వాబీటాఇన్ఫో ప్రకారం 2.23.14.18 బీటా వెర్షన్ లో ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. అలాగే కొన్ని నాన్ బీటా వెర్షన్ లక్కీ వినియోగదారులకు కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇది ఫోన్లో కెమెరా పనిచేయని వారికి, క్యూఆర్ కోడ్ స్కానింగ్ లో ఇబ్బందులు ఉన్న వారికి ఈ అప్ డేట్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఈ కొత్త ఫీచర్ పొందాలనుకుంటే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి అప్ డేట్ కోసం వెతకొచ్చు. దీంతో రెండో డివైజ్ కి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది.
మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకున్న తర్వాత.. యాప్ ఓపెన్ చేసి ‘లింక్‌డ్ డివైజెస్’ మెనూలో కనిపిస్తుంది. దానిలో లింక్ వెబ్ అకౌంట్ విత్ ఎ ఫోన్ నంబర్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకోవాలి.
ఇలా పనిచేస్తుంది..
ఈ ఫీచర్ కేవలం వాట్సాప్ వెబ్ కు మాత్రమే పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..