Fujifilms Instant Camera: వారెవ్వా ఏం కెమెరా.. కేవలం 90 సెకన్లల్లోనే మీ ఫొటో మీ చేతికి..

|

Apr 22, 2023 | 3:00 PM

ప్రస్తుతం స్మార్ట్ యాక్ససరీస్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువత ఇన్‌స్టంట్ కెమెరాల వాడకం వైపు మొగ్గుచూపుతున్నారు. మిగిలిన ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు సరదాగా తీసుకున్న ఫొటోలు వెంటనే ప్రింట్ అయ్యి వచ్చే ఇన్‌స్టంట్ కెమెరాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఫుజిఫిల్మ్ సరికొత్త ఇన్‌స్టంట్ కెమెరాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. తాజాగా ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 12 కెమెరాను లాంచ్ చేసింది. ఫుజీఫిల్మ్ ఇన్‌స్టాక్స్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.మినీ 12 […]

Fujifilms Instant Camera: వారెవ్వా ఏం కెమెరా.. కేవలం 90 సెకన్లల్లోనే మీ ఫొటో మీ చేతికి..
Fujfilm
Follow us on

ప్రస్తుతం స్మార్ట్ యాక్ససరీస్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువత ఇన్‌స్టంట్ కెమెరాల వాడకం వైపు మొగ్గుచూపుతున్నారు. మిగిలిన ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు సరదాగా తీసుకున్న ఫొటోలు వెంటనే ప్రింట్ అయ్యి వచ్చే ఇన్‌స్టంట్ కెమెరాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఫుజిఫిల్మ్ సరికొత్త ఇన్‌స్టంట్ కెమెరాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. తాజాగా ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 12 కెమెరాను లాంచ్ చేసింది. ఫుజీఫిల్మ్ ఇన్‌స్టాక్స్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.మినీ 12 అనే కొత్త కెమెరా ఇన్‌స్టాక్స్ సిరీస్‌లో పాకెట్-ఫ్రెండ్లీ మోడల్. అలాగే అక్కడికక్కడే ఫోటోలను ప్రింట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. జనాదరణ పొందిన ఇన్‌స్టాక్స్ మినీ 11కు కొనసాగింపుగా ఈ కెమెరాను మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. కెమెరా క్లోజ్-అప్ షాట్‌లు, సెల్ఫీలు తీసుకోవాలనుకునే వారి కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కెమెరా ఫంకీ బెలూన్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే ఈ కెమెరా ఐదు రంగులలో లభిస్తుంది. పర్పుల్, నీలం, గులాబీ, మింట్, తెలుపు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ కెమెరాకు సంబంధించిన ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఇన్‌స్టాక్స్ మినీ 12 కెమెరా ఆటోమేటిక్ ఎక్స్‌పోజర్ ఫంక్షన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఫొటో కోసం షట్టర్ నొక్కినప్పుడు కాంతి పరిమాణాన్ని స్వయంచాలకంగా గుర్తిస్తుంది. దానికి అనుగుణంగా షట్టర్ వేగం, ఫ్లాష్ స్థాయిని ఆప్టిమైజ్ చేస్తుంది. ప్రకాశవంతమైన అవుట్‌డోర్‌లు, తక్కువ కాంతి పరిస్థితుల్లో ఫొటోలు తీయడానికి చాలా సౌకర్యంగా పని చేస్తుంది. అలాగే ఇన్‌స్టాక్స్ మినీ 12 క్లోజ్-అప్ మోడ్ తో వస్తుంది, దీనిని ఒకసారి లెన్స్‌ని తిప్పడం ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మోడ్ క్లోజప్ షాట్‌లు, సెల్ఫీలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్‌స్టాక్స్ సిరీస్‌లోని మొదటి ఎంట్రీ-లెవల్ కెమెరా. ఇది వ్యూఫైండర్ వీక్షణ ఫీల్డ్‌ను అసలు ప్రింట్‌అవుట్ ప్రాంతానికి సరిపోయేలా సర్దుబాటు చేస్తుంది. మీరు ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటే షూటింగ్ సమయంలో ఫోటో ఎలా వస్తుందో తెలుసుకోవడానికి లెన్స్ పక్కన ఉన్న సెల్ఫీ మిర్రర్‌ని ఉపయోగించవచ్చు. ఇన్‌స్టాక్స్ మినీ 12 వినియోగదారు షట్టర్ బటన్‌ను నొక్కినప్పటి నుండి కేవలం ఐదు సెకన్లలో ఫోటోలను ప్రింట్ చేయగలదని ఫుజిఫిల్మ్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే కేవలం 90 సెకన్లల్లో ప్రింట్ చేసిన ఫొటో మన చేతికి వస్తుంది. ఈ కెమెరా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇన్‌స్టాక్ష్ వెబ్‌సైట‌్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ కెమెరా ధర రూ.9499గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..