Samsung Galaxy F15 5G: అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. టాప్ బ్రాండ్.. బెస్ట్ ఫీచర్స్..

|

Mar 05, 2024 | 6:53 AM

తక్కువ ధరలోనే మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ అత్యంత అనువైన బడ్జెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దాని పేరు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ. ఇది మీడియా టెక్ 6100ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. నాలుగు సంవత్సరాల ఓఎస్ అప్ డేట్లను అందిస్తుంది. ఇది బడ్జెట్లో లెవెల్లో 5జీ ఫోన్లు అందిస్తున్న రెడ్ మీ, రియల్ మీ, మోటోరోలా బ్రాండ్లతో ఇది మార్కెట్లో పోటీ పడే అవకాశం ఉంది.

Samsung Galaxy F15 5G: అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. టాప్ బ్రాండ్.. బెస్ట్ ఫీచర్స్..
Samsung Galaxy F15 5g
Follow us on

తక్కువ ధరలోనే మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ అత్యంత అనువైన బడ్జెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దాని పేరు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ. ఇది మీడియా టెక్ 6100ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. నాలుగు సంవత్సరాల ఓఎస్ అప్ డేట్లను అందిస్తుంది. ఇది బడ్జెట్లో లెవెల్లో 5జీ ఫోన్లు అందిస్తున్న రెడ్ మీ, రియల్ మీ, మోటోరోలా బ్రాండ్లతో ఇది మార్కెట్లో పోటీ పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15, 5జీ స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లభ్యతతో పాటు ధర వంటి వివరాలను తెలుసుకుందాం..

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ధర, లభ్యత..

ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. దీని ధర రూ. 12,999గ ఉంటుంది. అదే విధంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, అవి యాష్ బ్లాక్, జాజీ గ్రీన్, గ్రూవీ వైలెట్. ఫ్లిప్ కార్ట్ లో దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రారంభ సమయంలో దీనిని కొనుగోలు చేస్తే రూ. 1,299 విలువైన శామ్సంగ్ ట్రావెల్ అడాప్టర్ ను కేవలం రూ. 299కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్పెసిఫికేషన్స్..

ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల పూర్తి హెచ్డీ+ ఎస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డును వినియోగించుకొని 1టీబీ వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. నాలుగేళ్ల వరకూ ఓఎస్ అప్ డేట్లను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్‌లో రావడం లేదు. దాని కోసం వినియోగదారులు అదనపు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ కెమెరా..

స్మార్ట్ ఫోన్ కు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వెనుక వైపు వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (వీడీఐఎస్)తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. ఇది వీడియోలలో బ్లర్, షేకింగ్‌ని తగ్గిస్తుంది. దీంతో పాటు మరో 5ఎంపీ, 2ఎంపీ సెన్సార్లు కూడా ఉన్నాయి. అలాగే ముందు వైపు 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ని కలిగి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..