Nasa Artemis 1: వాయిదా పడిన నాసా మూన్ మిషన్ ఆర్టెమిస్ 1 ప్రయోగం.. అసలు కారణం ఏంటంటే?

|

Aug 29, 2022 | 7:10 PM

NASA ఆర్టెమిస్ - 1 మిషన్ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ మొదటి దశలో 2025లో మరోసారి చంద్రునిపైకి మానవులను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.03 గంటలకు లాంచ్ చేయాల్సి ఉండగా

Nasa Artemis 1: వాయిదా పడిన నాసా మూన్ మిషన్ ఆర్టెమిస్ 1 ప్రయోగం.. అసలు కారణం ఏంటంటే?
Nasa Artemis 1
Follow us on

నాసా మూన్ మిషన్ ఆర్టెమిస్-1 ప్రస్తుతం వాయిదా పడింది. ఇంజిన్ 3లో లోపం కారణంగా ఈ మిషన్‌ను వాయిదా వేసినట్లు నాసా ట్వీట్ చేసింది. NASA ప్రకారం, ఈ ప్రయోగం సెప్టెంబర్ 2 లేదా 5 న నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఈ మిషన్ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

NASA ఆర్టెమిస్ – 1 మిషన్ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ మొదటి దశలో 2025లో మరోసారి చంద్రునిపైకి మానవులను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.03 గంటలకు లాంచ్ చేయాల్సి ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా అది కుదరలేదు. అయితే, ఆర్టెమిస్-1 ప్రయోగంలో మానవులెవరూ పాల్గొనరు. ఈ మిషన్ లక్ష్యం SLS అంతరిక్ష నౌక బలాన్ని, ఓరియన్ అంతరిక్ష నౌక ఫిట్‌నెస్, హీట్ షీల్డ్‌ను పరీక్షించడమేనని నాసా తెలిపింది.

ఇవి కూడా చదవండి


చంద్రునిపై దీర్ఘకాలిక ఉనికిని సాధించడమే ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టెమిస్-1 అనేది SLS అంతరిక్ష నౌక కోసం చంద్రుని చుట్టూ 42 రోజుల ప్రయాణం చేయాల్సి ఉంది. దీని తరువాత, ఓరియన్ చంద్రుని ఉపరితలం చుట్టూ తిరగడానికి మొత్తం 10 రోజులు పడుతుందని నాసా ఇదివరకే ప్రకటించింది.