Nails Cutting: చీకటి పడగానే గోర్లను కత్తిరించుకోకూడదని ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదే

|

Jun 13, 2023 | 5:39 PM

భారతీయులు సాంప్రదాయాలకు ప్రాముఖ్యతనిస్తుంటారు. సాంప్రదాయాలకు కట్టుబడి నడుచుకోవడం అనేది అనాదిగా వస్తుంటుంది. భారత్‌లోని ప్రజలు సమయ సందర్భాలను బట్టి కొన్ని పనులను చేసుకుంటారు. అలాంటి అంశాల్లో రాత్రి పూట గోర్లను కత్తిరించుకునేది. సాయంత్రం లైట్స్‌ ఆన్‌ చేసిన..

Nails Cutting: చీకటి పడగానే గోర్లను కత్తిరించుకోకూడదని ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదే
Nails Cutting
Follow us on

భారతీయులు సాంప్రదాయాలకు ప్రాముఖ్యతనిస్తుంటారు. సాంప్రదాయాలకు కట్టుబడి నడుచుకోవడం అనేది అనాదిగా వస్తుంటుంది. భారత్‌లోని ప్రజలు సమయ సందర్భాలను బట్టి కొన్ని పనులను చేసుకుంటారు. అలాంటి అంశాల్లో రాత్రి పూట గోర్లను కత్తిరించుకునేది. చీకటి పడగానే ప్రతి ఇంట్లో లైట్లను ఆన్ చేస్తుంటారు. ఇలా లైట్స్‌ ఆన్‌ చేసిన తర్వాత చేతి గోర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్‌ చేసుకోకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. పొరపాటున ఎవరైనా కత్తిరిస్తే మంచిది కాదంటారు. సంధ్యా స‌మయంలో ల‌క్ష్మీదేవి ఇంటికి వ‌స్తుంది కాబట్టి ఆ స‌మ‌యంలో గోర్లు క‌త్తిరిస్తే అశుభం అని చెబుతుంటారు. కానీ రాత్రి సమయంలో గోర్లను కత్తిరించుకోవడం అనేది మూఢనమ్మకంగానే భావిస్తుంటారు. వాస్తవానికి మన పెద్దలు చెప్పే ప్రతి విష‌యానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అయితే ఇలా సాయంత్రం గానీ, రాత్రి కాగానే వేళ్ల గోర్లను కత్తిరించుకోకూడదనేది భారతదేశంలోని కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలా కత్తిరించుకుంటే చెడు సంకేతాలో.. దయ్యాలో వస్తాయని పెద్దలు చెబుతుంటారు. వాస్తవానికి ఈ న‌మ్మకాల వెనుక బ‌ల‌మైన శాస్త్రీయ కార‌ణమే ఉంది.

పూర్వకాలంలో విద్యుత్‌ ఉండేది కాదు. దీని కారణంగా ఇళ్లలో కరెంటు లేని కారణంగా ట్యూబ్‌లైట్లు, లైట్స్‌ ఉండేవి కావు. ఆ స‌మ‌యంలో సూర్యాస్తమ‌యం త‌రువాత చిమ్నీలు, బుడ్డీదీపాలు మాత్రమే వాడేవారు. ఆ సమయంలో గోర్లను కత్తిరించుకునేందుకు నెయిల్‌ కట్టర్లు కూడా ఉండేవి కావు. గోర్లను కత్తిరించుకోవాలంటే కత్తి, లేదా బ్లేడ్స్‌ను ఉపయోగించుకోవాల్సి ఉండేది. అయితే సూర్యాస్తమయం తర్వాత చీకటిలో పదునైనా వస్తువులను ఉపయోగించినట్లయితే వేళ్లు కట్‌ అయ్యే ప్రమాదం ఉందని, అందుకే రాత్రి స‌మ‌యంలో గోర్లను కత్తిరించుకోకూదని చెబుతుంటారు. ఇలాంటివి చెప్పినా చాలా మంది అవేమి పట్టించుకోకుండా గోర్లను కత్తిరించుకునేవారు. అలా వినకపోవడంతో దేవుడు లేదా దెయ్యం పేరు చెప్పి వారిని గోర్లు తీసుకోకుండా ఉండేవారు. ఇందులో నిజం ఏంటంటే.. శాస్త్రీయ కార‌ణాల కంటే మూఢనమ్మకాలను చెప్పినప్పుడే జనాలు ఎక్కువగా నమ్మేవారు. అందుకే అలా చెప్పేవాళ్లు.

అదే విధంగా పగటిపూట ఇంట్లో చేతి లేదా కాళ్ల గోర్లను కట్‌ చేయడం కారణంగా కొన్ని గోర్లు అక్కడక్కడ పడిపోవచ్చు. అవి ఆహారంలో కలుషితం అయ్యే అవకాశాలుంటాయి. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాలు అనారోగ్యం, సంక్రమ‌ణ‌కు కార‌ణ‌మ‌య్యే సూక్ష్మజీవుల‌కు నివాసంగా మారే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారు కిండిపడిపోయిన గోర్లు నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉన్నందున ఇలా సాయంత్రం పూట గోర్లను కత్తిరించుకోకూడదని చెప్పేందుకు మరో ప్రధాన కారణం. అయితే ఇలా గోర్లను ఇలా కత్తిరించుకోకూడదని శాస్త్రీయ కారణం ఉన్నప్పటికీ ఇది మూఢనమ్మకంగానే భావిస్తుంటారు చాలా మంది. ఇక చాలా మంది చేతి వేళ్లను నోట్లో పెట్టుకుని గోర్లను అదే పనిగా కోరుకుతుంటారు. అలా చేసిన ఆరోగ్యానికి హానికరమే. చేతి గోర్లలో ఉండే మట్టి నోట్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటివి చెప్పేవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి