Smart Phone: ఆ మోటరోలా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.50 వేల తగ్గింపు

భారత మార్కెట్లో ఫోల్డబుల్, ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలో ఫ్లిప్‌ ఫోన్‌ అంటే మొదటగా గుర్తు వచ్చేది మోటరోలా. ఇటీవల మోటరోలా కంపెనీ తన తాజా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్, మోటరోలా రేజర్ 60 అల్ట్రాను భారతదేశంలో విడుదల చేసింది. దీంతో మోటరోలా కంపెనీ రేజర్ 50 అల్ట్రాపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌పై అందించే తాజా డిస్కౌంట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Phone: ఆ మోటరోలా ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.50 వేల తగ్గింపు
Motorola Razr 50

Updated on: May 15, 2025 | 10:57 AM

ప్రస్తుతం మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,19,000 ధరతో లాంచ్‌ చేశారు. అయితే మోటరోలా రేజర్ 60 అల్ట్రా లాంచ్‌తో రేజర్ 50 అల్ట్రా ధరను ఆ కంపెనీ ఒక్కసారిగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏకంగా 42 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపుతో మోటరోలా రేజర్ 50 అల్ట్రాను కేవలం రూ.68,549కి పొందవచ్చు.

మోటరోలా రేజర్ 50 అల్ట్రా అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌కు ప్రస్తుతం ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేనప్పటికీ అది కూడా అందుబాటులోకి వస్తే, మీరు దానిని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని గమనించాలి. ఇక రేజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌ అల్ట్రా సిలికాన్ పాలిమర్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో సొగసైన డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ ఐపీఎక్స్‌ 8 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ లోపలి భాగంలో అద్భుతమైన 6.9 అంగుళాల డిస్‌ప్లే, 165 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. 

మోటరోలా రేజర్ 50 అల్ట్రా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్‌తో 4 అంగుళాల డిస్‌ప్లే కూడా ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 పై నడుస్తుంది. పనితీరు విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ ఫోన​ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్‌ జెన్‌-3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12 జీబీ+512 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్‌ ఫోటోగ్రఫీ పరంగా 50+50 మెగాపిక్సెల్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి