Maruti Suzuki: ఈ ఏడాది 3 కొత్త కార్లని లాంచ్‌ చేయనున్న మారుతి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

|

May 20, 2022 | 9:52 PM

Maruti Suzuki: మారుతి సుజుకి ఈ ఏడాది మూడు పెద్ద కార్లను విడుదల చేయబోతోంది. నిజానికి మారుతి కంపెనీ భారతీయ మార్కెట్‌లో అతిపెద్ద మార్కెట్

Maruti Suzuki: ఈ ఏడాది 3 కొత్త కార్లని లాంచ్‌ చేయనున్న మారుతి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Maruti Suzuki
Follow us on

Maruti Suzuki: మారుతి సుజుకి ఈ ఏడాది మూడు పెద్ద కార్లను విడుదల చేయబోతోంది. నిజానికి మారుతి కంపెనీ భారతీయ మార్కెట్‌లో అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీకి CNG కార్లు , పెట్రోల్, డీజిల్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు అందిన కొత్త సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ CNG వేరియంట్‌లో మారుతి సుజుకి బాలెనోను పరిచయం చేయబోతుంది. ఇప్పటికే దీనిలో కొన్ని మార్పులు చేస్తుంది. మారుతి సుజుకి సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి ఆల్టో కూడా ఈ లిస్టులో ఉంది. ఇది కొత్త రూపంలో వినియోగదారుల ముందుకు రాబోతుంది.

1. న్యూ జెన్ మారుతి ఆల్టో : మారుతి ఆల్టో భారతీయ మార్కెట్లో అత్యంత ఫేమస్‌ అయిన కారు. ఈ సంవత్సరం కంపెనీ ఈ కారులో మార్పులు చేయబోతోంది. ఇది పాత వెర్షన్ కంటే పెద్ద సైజులో వస్తుంది. ఈ కారులో పెట్రోల్ ఇంజన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే CNG ఆప్షన్‌ కూడా ఉంటుంది.

2. కొత్త తరం మారుతి బ్రెజ్జా : మారుతి విటారా బ్రెజ్జాను కొత్త వేరియంట్‌లో పరిచయం చేయనుంది. షార్పర్ ఎక్స్టీరియర్ స్టైలింగ్, కొత్త ఇంటీరియర్ డిజైన్ ఈ మోడల్స్‌లో కనిపిస్తాయి. దీంతో పాటు కొత్త కటౌట్ అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తాయి. సరికొత్త K15C పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చనున్నారు. కొత్త ఎర్టిగా XL6 ట్రాన్స్‌మిషన్ ఇందులో కనిపించనుంది. ఈ కారు 5 స్పీడ్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది.

ఇవి కూడా చదవండి

3. కొత్త మిడ్ సైడ్ SUV కారు : మారుతి సుజుకి కొత్త C సెగ్మెంట్ SUV కారును సిద్ధం చేస్తోంది. ఇది భారతదేశంలో త్వరలో ప్రారంభమవుతోంది. ఇందుకోసం కంపెనీ టొయోటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రెండు బ్రాండ్‌లు చిన్నపాటి కాస్మెటిక్ మార్పులతో విక్రయిస్తాయి. దీపావళి సందర్భంగా ఈ కారును విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను చూడవచ్చు. ఒకటి తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌తో ప్రారంభమవుతుంది. వినియోగదారులు మెరుగైన మైలేజీని పొందుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి