Refrigerator: రిఫ్రిజిరేటర్ కొనాలని చూస్తున్నారా? 4 స్టార్- 5 స్టార్ రేటింగ్స్‌ మధ్య తేడా ఏమిటి?

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిజ్‌) ఉంటుంది. ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఎండాకాలం వచ్చిదంటే చాలు ఫ్రిజ్‌ లేని వారు కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఫ్రిజ్‌ కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్స్‌, ఫీచర్స్‌ గురించి అవగాహన ఉండాలి. ఆహారం, పచ్చి కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. ఈ కారణంగా..

Refrigerator: రిఫ్రిజిరేటర్ కొనాలని చూస్తున్నారా? 4 స్టార్- 5 స్టార్ రేటింగ్స్‌ మధ్య తేడా ఏమిటి?
Refrigerator
Follow us

|

Updated on: May 04, 2024 | 12:54 PM

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ (ఫ్రిజ్‌) ఉంటుంది. ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఎండాకాలం వచ్చిదంటే చాలు ఫ్రిజ్‌ లేని వారు కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఫ్రిజ్‌ కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్స్‌, ఫీచర్స్‌ గురించి అవగాహన ఉండాలి. ఆహారం, పచ్చి కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తారు. ఈ కారణంగా చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ఒక ముఖ్యమైన గాడ్జెట్‌గా మారింది. కాలంతో పాటు రిఫ్రిజిరేటర్లలో చాలా మార్పులు వచ్చాయి. మార్కెట్‌లో ఇప్పటి వరకు సాధారణ రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా కరెంటు వినియోగించేవి ఉన్నాయి. అయితే సాంకేతికత మారడంతో విద్యుత్ ఆదా చేసే రిఫ్రిజిరేటర్లు రావడం మొదలైంది.

ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లలో విద్యుత్ ఆదా కోసం 3, 4,5 స్టార్ రేటింగ్‌లు ఇస్తాయి కంపెనీలు. అంతేకాకుండా ఇన్వర్టర్ ఫ్రిజ్‌లు కూడా వచ్చాయి. ఇవి చాలా విద్యుత్ ఆదా చేస్తాయి.4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్‌ల మధ్య వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు ఓ అవగాహన వస్తుంది. అప్పుడు ఎలాంటి ఫ్రిజ్‌ కొనాలో నిర్ణయించుకుంటారు.

4 స్టార్ రిఫ్రిజిరేటర్ vs 5 స్టార్ రిఫ్రిజిరేటర్

5 స్టార్ రిఫ్రిజిరేటర్లు 4 స్టార్ రిఫ్రిజిరేటర్ల కంటే చాలా ఖరీదైనవి. అలాగే వాటి నాణ్యత కూడా చాలా బాగుంది. దీనిలో 5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లలో మెరుగైన సాంకేతికత ఉంటుంది. దీని కారణంగా 4 స్టార్ రిఫ్రిజిరేటర్‌లతో పోలిస్తే 5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లు సంవత్సరానికి 100 నుండి 150 యూనిట్ల తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఈ కారణంగా మార్కెట్లో 4 స్టార్ రిఫ్రిజిరేటర్ల కంటే 5 స్టార్ రేటెడ్ రిఫ్రిజిరేటర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.

4 స్టార్ – 5 స్టార్ రిఫ్రిజిరేటర్.. ఇందులో ఏది కొంటే బెటర్‌

4 స్టార్ -5 స్టార్ రిఫ్రిజిరేటర్‌లు రెండూ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. అయితే రెండు రిఫ్రిజిరేటర్‌ల మధ్య వ్యత్యాసం చేసినట్లయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఇక రిఫ్రిజిరేటర్ ధర గురించి మాట్లాడినట్లయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు చాలా ఖరీదైనవి ఉంటాయి. ఈ రిఫ్రిజిరేటర్లు విద్యుత్ ఆదా, నిర్వహణ పరంగా మరింత ఆదా చేయడంలో మీకు సహాయపడతాయి. మీకు బడ్జెట్ ముఖ్యం కానట్లయితే మీరు 5 స్టార్ రేటింగ్‌తో రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ రిఫ్రిజిరేటర్‌లు ఇతర రిఫ్రిజిరేటర్‌లతో పోలిస్తే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. అంతేకాకుండా ఈ రిఫ్రిజిరేటర్లు పర్యావరణానికి కూడా మంచివి. ఎందుకంటే అవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్