Redmi Smart Fire TV 4K: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ టీవీ.. అమెజాన్‌ ఓఎస్‌తో తక్కువ ధరలోనే కళ్లు చెదిరే ఫీచర్లు..

|

Sep 17, 2023 | 8:45 AM

తాజాగా రెడ్‌మీ సరికొత్త స్మార్ట్‌ టీవీను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా అమెజాన్‌ ఓఎస్‌ ద్వారా పని చేసే ఈ టీవీ కచ్చితంగా మార్కెట్‌లో తన ప్రాధాన్యతను నిలుపుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ టీవీను  43 అంగుళాల వెర్షన్‌లో రిలీజ్‌చేశారు. అంతే కాకుండా ఈ టీవీ వాస్తవ ధర రూ.26,999గా ఉంటే పరిమిత సమయం వరకు మాత్రం ప్రత్యేక ధర రూ. 24,999కు అందుబాటులో ఉంటుంది.

Redmi Smart Fire TV 4K: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ టీవీ.. అమెజాన్‌ ఓఎస్‌తో తక్కువ ధరలోనే కళ్లు చెదిరే ఫీచర్లు..
Redmi Tv
Follow us on

పేదవారికి వినోదాన్ని అందించే సాధనాల్లో టీవీలు ముందు వరుసలో ఉంటాయి. రోజంతా కష్టపడి సేదతీరే సమయంలో కొంతసేపు టీవీ చూడడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో పరిపాటిగా మారింది. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా టీవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో కేవలం స్మార్ట్‌టీవీలు మాత్రమే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. మొబైల్‌ రంగంలో తన హవా చూపిన ఎంఐ కంపెనీ స్మార్ట్‌ టీవీల మార్కెట్‌లో తన దూకుడును కనబరుస్తుంది. తాజాగా రెడ్‌మీ సరికొత్త స్మార్ట్‌ టీవీను మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా అమెజాన్‌ ఓఎస్‌ ద్వారా పని చేసే ఈ టీవీ కచ్చితంగా మార్కెట్‌లో తన ప్రాధాన్యతను నిలుపుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ టీవీను  43 అంగుళాల వెర్షన్‌లో రిలీజ్‌చేశారు. అంతే కాకుండా ఈ టీవీ వాస్తవ ధర రూ.26,999గా ఉంటే పరిమిత సమయం వరకు మాత్రం ప్రత్యేక ధర రూ. 24,999కు అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ అమెజాన్‌తో పాటు ఎంఐ వెబ్‌సైట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ టీవీ విక్రయ తేదీని మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

రెడ్‌మీ ఫైర్‌ టీవీ ఫీచర్లు ఇవే

రెడ్‌మీ ఫైర్‌ 4కే టీవీ 108 సీఎం స్క్రీన్ పరిమాణంతో వస్తుంది. ఇది ఫైర్‌ ఓఎస్‌ ద్వారా పని చేస్తంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీతో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేను ఈ టీవీ ప్రత్యేకత. అంతేకాకుండా 24 వాట్స్‌ స్పీకర్లు, డాల్బీ ఆడియోతో పాటే డీటీఎస్‌ వెర్షన్లకు సపోర్ట్‌ చేస్తుంది. ముఖ్యంగా ఈ టీవీ వర్చువల్ ఎక్స్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ఏ 55 ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. ఈ టీవీ సూపర్‌ స్లిమ్‌ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్‌తో భాగస్వామ్యం కారణంగా ఈ టీవీ అంతర్నిర్మిత అలెక్సాతో వస్తుంది. ఈ టీవీ బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో పాటు డ్యూయల్-బ్యాండ్ వైఫైని కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీ పిక్చర్-ఇన్-పిక్చర్ టెక్నాలజీని కూడా పరిచయం చేస్తుంది. ఇది మీ టీవీ వీక్షణ అనుభవానికి అంతరాయం కలిగించకుండా ఎక్కువ పనులను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..