KTM Bikes: కేటీఎం బైక్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఈ పని వెంటనే చేసుకోండి.. లేకపోతే ప్రమాదం జరగొచ్చు..

కేటీఎం బైక్ వాడుతున్నవారికి బిగ్ అలర్ట్.. 2024 మోడళ్ల బైకుల్లో ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌కు సంబంధించి సమస్యను కంపెనీ గుర్తించింది. దీని వల్ల పెట్రల్ లీకై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున.. కంపెనీ యాజమాన్యం కీలక ప్రకటన జారీ చేసింది.

KTM Bikes: కేటీఎం బైక్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఈ పని వెంటనే చేసుకోండి.. లేకపోతే ప్రమాదం జరగొచ్చు..
Ktm Bikes

Updated on: Nov 21, 2025 | 3:53 PM

KTM Recall: కేటీఎం కొత్త కొత్త మోడల్స్‌తో యువతను ఆకట్టుకునేలా విభిన్న డిజైన్లతో బైక్‌లు తీసుకొస్తుంది. దీంతో యువత కూడా వీటిని కొనేందుకు తెగ ఆసక్తి కనబరుస్తోంది. కేటీఎం బైక్స్ సేల్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఆస్ట్రియన్ కంపెనీ అయిన కేటీఎమ్ ఆటోమొబైల్స్ రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తోంది. అయితే కేటీఎం బైక్‌లు కొనుగోలు చేసినవారికి తాజాగా ఆ కంపెనీ కీలక ప్రకటన జారీ చేసింది. 2024 మోడళ్ల బైక్‌లను కొనుగోలు చేసినవారికి రీ కాల్ ప్రకటించింది. 2024 మోడల్ బైక్‌లు కొనుగోలుచేసినవారు తమ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని సూచించింది.

2024 మోడల్ బైకుల్లో ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ సీల్స్ చిన్న పగుళ్ల సమస్య ఏర్పడింది. దీని వల్ల పెట్రోల్ లీక్ అయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ లీక్ అయితే ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో వినియోగదారుల భద్రత కోసం కేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. కేటీఎం 125 డ్యూక్, 250 డ్యూక్, 390 డ్యూక్, 990 డ్యూక్ మోడళ్ల బైక్‌ల్లో ఈ సమస్యను గుర్తించారు. దీంతో ఆ మోడళ్ల బైక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా రీకాల్ ప్రకటించింది కేటీఎం. ఈ మేరకు వినియోగదారులకు మెస్సేజ్‌లు లేదా ఫోన్లు చేసి సమాచారం ఇస్తోంది. తమ సమీపంలోని కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్లకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దీంతో 2024 మోడల్ బైక్స్ కొన్నవారు వెంటనే ఈ పని చేయాలి.

ఎలా చెక్ చేసుకోవాలి..?

మీ బైక్ రీకాల్‌లో ఉందో.. లేదో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కేటీఎం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని మీ బైక్ చాసిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ బైక్ రీ కాల్‌లో ఉందో.. లేదో తెలుస్తుంది.