Chicken – Biodiesel: చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్.. లీటర్‌కు రూ.59 లు మాత్రమే.. ఎక్కడ తయారు చేస్తున్నారంటే..

Biodiesel: ప్రపంచాన్ని ఇంధన కొరత పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం కీలక ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. చికెన్ వ్యర్థాలతో..

Chicken - Biodiesel: చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్.. లీటర్‌కు రూ.59 లు మాత్రమే.. ఎక్కడ తయారు చేస్తున్నారంటే..
Chicken

Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2021 | 4:25 PM

Biodiesel: ప్రపంచాన్ని ఇంధన కొరత పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం కీలక ఆవిష్కరణకు వేదికగా నిలిచింది. చికెన్ వ్యర్థాలతో బయో డీజిల్‌ను ఉత్పత్తి చేసి సంచలనం సృష్టించారు. ఈ ఇంధన వాడకం ద్వారా కాలుష్య ప్రభావం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండటం విశేషం. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. కోళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలో, కోడి మాంసం వినియోగంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు దన్నుగా నిలిచే సరికొత్త పరిజ్ఞానాన్ని కేరళకు చెందిన పశు వైద్యుడు జాన్‌ అబ్రహం ఆవిష్కరించారు. చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారు చేసి చూశారు. అయితే, తాజాగా ఈయన అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం పేటెంట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పేటెంట్ల జారీ కార్యాలయం నుంచి ఆయనకు ధృవీకరణ లభించింది.

డాక్టర్‌ జాన్‌ అబ్రహం ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌ జిల్లా పుకొడ్‌ వెటర్నరీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడులోని నమక్కల్‌ వెటర్నరీ కళాశాలలో డాక్టోరల్‌ రిసెర్చ్‌ చేస్తుండగా చికెన్‌ వ్యర్థాలనుంచి బయో డీజిల్‌ను తయారుచేసే పరిజ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేశారు. 2014లోనే పేటెంట్ల కోసం తమిళనాడు వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ వర్సిటీ తరఫున దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు ఆమోదం లభించింది.

Biodiesel From Chicken Waste

2014లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) అందించిన రూ. 18 లక్షలతో పాటు.. పుకొడ్‌ వెటర్నరీ కళాశాల క్యాంపస్‌ లోనే పైలట్‌ ప్రాజెక్టు ప్రాతిపదికన చికెన్‌ వ్యర్థాల నుంచి బయో డీజిల్‌ తయారుచేసే ప్లాంట్‌ను ఆయన ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్‌లోనే కొచ్చిలోని భారత్‌ పెట్రోలియం రిఫైనరీ నిపుణులు తమ ప్లాంట్‌ను సందర్శించి, బయో డీజిల్‌ నాణ్యతను ధృవీకరించారని జాన్ అబ్రహం తెలిపారు. నాటి నుంచి పుకొడ్‌ వెటర్నరీ కళాశాలకు చెందిన ఒక వాహనాన్ని ఈ ఇంధనంతోనే నడుపుతున్నామని చెప్పారు. దాదాపు 100 కేజీల చికెన్‌ వ్యర్థాల నుంచి ఒక లీటరు బయో డీజిల్‌ ఉత్పత్తి అయిందని, దీన్ని మార్కెట్లో లీటరుకు రూ.59 చొప్పున విక్రయించొచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

Also read:

Raj Kundra: రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..

Pragya Jaiswal: లాక్‌డౌన్‌ జీవితంపై ప్రగ్యా జైస్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు .. జీవితంలో ఏది ముఖ్యమో తెలిసిందంటూ వేదాంతం

TS Theaters: తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల ధరల పై హైకోర్టులో విచారణ..