Google Update: ఫొటో తీస్తే చాలు.. మీ చర్మ సమస్య ఏంటో తెలిసిపోతుంది.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రిలీజ్ చేసిన గూగుల్

|

Jun 16, 2023 | 4:00 PM

చర్మ సంబంధిత సమస్యలను బేరీజు వేయడానికి గూగుల్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తీసుకువచ్చింది. కేవలం సమస్య ఉన్న ప్రాంతాన్ని ఫొటో తీయడం ద్వారా సమస్య ఏంటో ఇట్టే చెప్పేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఫీచర్ గూగుల్ లెన్స్ ద్వారా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

Google Update: ఫొటో తీస్తే చాలు.. మీ చర్మ సమస్య ఏంటో తెలిసిపోతుంది.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రిలీజ్ చేసిన గూగుల్
Google Lens
Follow us on

సాధారణంగా పెరుగుతున్న కాలుష్యం జీవనశైలి కారణంగా చర్మ సంబంధిత సమస్యల తరచూ వేధిస్తూ ఉంటాయి. అయితే చర్మం దద్దుర్లు, పొక్కులు వంటివి వస్తూ ఉంటాయి. ఓ నాలుగు రోజుల తర్వాత అవి వాటంతట అవే మాడిపోతాయి. ఒక్కోసారి రోజుల తరబడి అలానే ఉంటూ దురదతో చికాకు తెప్పిస్తాయి. ఆ సమయంలో మనం డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్తే ప్రారంభంలోనే రావాల్సింది. ఇప్పుడు బాగా ముదిరిపోయాయి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ప్రారంభంలోనే వెళ్తే చిన్న సమస్యేనంటూ ఏదో ఓ ఆయింట్‌మెంట్ ఇస్తారు. అయితే మనకు వచ్చిన సమస్య సీరియస్సా? కాదా? అనే అనుమానం తొలుస్తూ ఉంటుంది. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలను బేరీజు వేయడానికి గూగుల్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తీసుకువచ్చింది. కేవలం సమస్య ఉన్న ప్రాంతాన్ని ఫొటో తీయడం ద్వారా సమస్య ఏంటో ఇట్టే చెప్పేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఫీచర్ గూగుల్ లెన్స్ ద్వారా పని చేస్తుందని పేర్కొంటున్నారు. గూగుల్ తీసుకొచ్చిన ఆ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

గూగుల్ లెన్స్ అప్‌డేట్ పని చేస్తుందిలా

మీ శరీరంపై దద్దుర్లు లేదా గడ్డలను మీరు గుర్తించిన సందర్భంలో గూగుల్ ఇప్పుడు చర్మ పరిస్థితులు గుర్తించడాన్ని సులభతరం చేస్తోంది. అంతేకాదు జుట్టు రాలడం లేదా మీ గోళ్లపై ఒక గీత కూడా గూగుల్ ద్వారా శోధించే అవకాశం ఉంటుంది. మీ చర్మ పరిస్థితులను శోధించే సామర్థ్యంతో లెన్స్ అప్‌డేట్ చేసింది. కేవలం స్మార్ట్‌ఫోన్‌తో చిత్రాన్ని తీయాలి. లెన్స్ ద్వారా ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అంతే మీరు మీ శోధనకు అనుగుణంగా అలాంటి ఫొటోలను హైలేట్ చేస్తుంది. ముఖ్యంగా చర్మ సమస్యకు కారణాన్ని గుర్తించడంలో గూగుల్ లెన్స్ సహాయం చేసినప్పటికీ ఏదైనా చర్య తీసుకునే ముందు ఎవరైనా వెళ్లి వైద్యుడిని చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి