
భారతదేశంలో రెండు సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించిన తర్వాత రిలయన్స్ జియో ఇప్పుడు కొత్త ఆఫర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న జియో 5 జీ ఫోన్ గంగా అనే కోడ్‌నేమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు, మెరుగైన హార్డ్‌వేర్ ఫీచర్లతో ఇంతకు ముందు రిలీజైన ఫోన్స్ కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు వాటి ఆకర్షణీయమైన ఫీచర్‌లు, సరసమైన ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారుల ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. అలాగే ఈ గంగా 5 జీ ఫోన్ లాంచింగ్ ఈ ఏడాది చివర్లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ పండుగైన దీపావళి పండుగ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా జియో గంగా 5జీ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఇటీవల లీకయ్యాయి, ఇది అనేక అప్‌గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉంటుందని సూచిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన హార్డ్‌వేర్ నాణ్యత, కెమెరాతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్యాప్సూల్ డిజైన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చు, ఏఐ సామర్థ్యాలతో పాటు 13 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉండవచ్చు.
ఈ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందించే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 4 జీబీ +32 జీబీ వేరింయంట్లో అందుబాటులో ఉంటుంది. 6.5 అంగుళాల ఎల్‌సీడీ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.6000 నుంచి రూ.8000 వరకూ ఉంటుందని అవంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..