Mukesh Ambani: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు: అంబానీ

|

Oct 01, 2022 | 2:05 PM

దేశంలో 5జీ టెక్నాలజీ రానే వచ్చేసింది.న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరవ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 5G సేవలను..

Mukesh Ambani: వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు: అంబానీ
Mukesh Ambani
Follow us on

దేశంలో 5జీ టెక్నాలజీ రానే వచ్చేసింది.న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరవ ఎడిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 5G సేవలను ప్రారంభించారు. 5G టెక్నాలజీ భారతదేశంలోని మొబైల్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా 5జీ సేవలు పొందనున్నారు. దేశంలోని రెండు అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ సంవత్సరం 5G సేవలను ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ముందుగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఈ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, దీపావళి నాటికి ఈ నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అంబానీ స్పష్టం చేశారు.

5జీ సేవల దిశగా సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, టెలికాం డిపార్ట్‌మెంట్‌ కృషి గర్వకారణమన్నారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు అసియన్‌ మొబైల్‌ కాంగ్రెష్‌, గ్లోబల్‌ మొబైల్‌ కాంగ్రెస్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే తరం కనెక్టివిటీ టెక్నాలజీ కంటే 5జీ అధికమని అన్నారు. 5జీ ఆధారిత డిజిటల్‌ సొల్యూషన్స్‌ చవకైన నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యాలను దేశంలోని సామాన్య పౌరులకు చేరువవుతాయని అన్నారు.

అయితే గత కొన్ని నెలలుగా 5జీ టెక్నాలజీ కోసం తీవ్ర కసరత్తు జరిగింది. పలు టెలికాం కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ముందు నుంచే 5జీ నెట్‌ వర్క్‌ కోసం ట్రయల్స్‌ సైతం నిర్వహించాయి. ఎన్నో నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 5 జీ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడున్న 4 జీ టెక్నాలజీ కంటే 5 టెక్నాలజీ దాదాపు 10 రేట్లు వేగంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిటెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి