
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO).. ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్లను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా, అమెరికా లాంటి దేశాలు మన ఇస్రోను అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు అదే రష్యా, అమెరికా దేశాలకు చెందిన కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెట్టే స్థాయికి ఇస్రో చేరుకుంది. ఐదేళ్ల క్రితం వరకు చిన్నచిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో, ఇప్పుడు అత్యంత భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యమున్న రాకెట్‌ను తయారు చేసింది. మరి కొన్ని రోజుల్లో ఈ మహా బాహుబలి రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది నూరవది. ఈ సందర్భంగా అత్యంత భారీ రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్రో.
ఇస్రో ప్రస్థానంలో మరో మైలు రాయిని దాటేందుకు కౌంట్ డౌన్ షురూ అయింది.. డిసెంబర్ 24వ తేదీన జరిగే LVM 3 ప్రయోగంతో ఇస్రో సెంచరీ కొట్టనుంది. అమెరికా-భారత్ సంయుక్తంగా చేపడుతున్న ప్రయోగం ఇది. ఇస్రో చేపడుతున్న వందో ప్రయోగమే కాకుండా ఇంకా ఈ లాంచ్ ద్వారా ఇస్రో కొత్త రికార్డు కొట్టబోతోంది. 24వ తేదీన శ్రీహరికోట నుంచి ఈ మెగా బాహుబలి రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో అత్యంత భారీ రాకెట్ మాత్రమే కాదు.. ఇది ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది నూరవది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న blue bird శాటిలైట్. భారత్‑అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. ఇస్రో రాకెట్ ప్రయోగ తేదీ డిసెంబర్ 24 గా ప్రకటించింది. ఎల్‌వీఎమ్-3 M 6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వద్ద రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశ పెట్టగలిగేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలంటే ఫ్రెంచ్ గయా, రష్యా లాంటి దేశాల నుంచి ఆదేశాల సహకారంతో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో.
ఇస్రో ఈ పరిస్థితులను అధిగమించింది. LVM – 03 సరికొత్త వాహక నౌకను తయారు చేసింది.. 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన రాకెట్ ను తయారు చేసి సక్సెస్ చేసింది. ఈ రాకెట్ ను బాహుబలి రాకెట్ గా పిలిచేవారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఇంకా చెప్పాలంటే బాహుబలి-2 రాకెట్ అన్నట్లు LVM- 03 అప్‌గ్రేడ్ అయ్యింది. 6.5 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది. ప్రయోగ సమయం 24 ఉదయం 8.50 గంటలకు ఉంటుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
🚀 LVM3-M6 Mission Launch Scheduled
The launch of LVM3-M6 is scheduled on 24 December 2025 at 08:54 hrs IST from the Second Launch Pad (SLP), SDSC SHAR, Sriharikota.
👀 The public can witness the launch from the Launch View Gallery, SDSC SHAR by registering online:
👉… pic.twitter.com/DXJ9JsFAhM— ISRO (@isro) December 19, 2025
టెక్సాస్ కేంద్రంగా పనిచేసే A స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ బ్లూ బర్డ్ శాటిలైట్‌ను రూపొందించారు. ఈ ఉపగ్రహం హై బ్యాండ్‌విడ్త్ నెట్‌వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్‌వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రమ్ ద్వారా అనుసంధానమై సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. అక్టోబరు 19న అమెరికా నుంచి బ్లూబర్డ్-6 ఉపగ్రహం శ్రీహరికోటకు చేరి అనుసంధాన పనులు, ఇంధన నింపుదల, తుది తనిఖీల పరిశీలనలు శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.
ఇతర ఉపగ్రహాల కంటే మూడున్నర రెట్లు పెద్దదిగా, సుమారు పది రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది. ఇదే రాకెట్ ద్వారా భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది ఇస్రో. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో వందవది కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల తోపాటు మాజీ శాస్త్రవేత్తల్లో కూడా ఇస్రో ఘనత అనే గర్వం కనబడుతోంది..
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..