1000 years old egg: తవ్వకాల్లో లభించిన అరుదైన నిధి.. ఆ కోడిగుడ్డు వెయ్యి ఏండ్లు..

|

Jun 14, 2021 | 12:04 AM

ఇజ్రాయెల్‌లో పరిశోధకుల తవ్వకాల్లో అరుదైన కొన్నింటి వారు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిపిన‌ తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా

1000 years old egg: తవ్వకాల్లో లభించిన అరుదైన నిధి.. ఆ కోడిగుడ్డు వెయ్యి ఏండ్లు..
1,000 Years Old Egg
Follow us on

ఇజ్రాయెల్‌లో పరిశోధకుల తవ్వకాల్లో అరుదైన కొన్నింటి వారు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిపిన‌ తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్న‌ది. దానికి బ‌య‌ట‌కు తీసి శుభ్రపరుస్తుండ‌గా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భ‌ద్రప‌రిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజుల‌కే చెడిపోతున్న త‌రుణంలో వేయి సంవ‌త్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భ‌ద్రంగా ఉందో క‌నుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయ‌త్నాలు ప్రారంభించారు.

ఇది ప్రపంచంలోనే అతి పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్‌బుక్‌లో ఒక వివరణాత్మక పోస్ట్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్‌లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల‌ సమయంలో ఈ పురాత‌న కోడిగుడ్డు దొరికింది.

ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొర‌క‌డం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పుర‌వాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్‌ లీ పెర్రీ గాల్ చెప్పారు.

 

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్

Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

CM KCR Review: అంద‌రి భాగ‌స్వామ్యంతోనే నూటికి నూరుశాతం అభివృద్ధి.. సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు..