
ఐక్యూ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియో 10 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇది ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా మెరుగైన పనితీరు కేంద్రీకృతంగా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ చేసింది. నియో 10 సిరీస్‌లో భాగంగా ప్రో ప్లస్ మోడల్ త్వరలో ప్రామాణిక ఐక్యూ నియో 10తో పాటు భారతీయ మార్కెట్లలో లాంచ్ చేస్తారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ ఐదు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 35,500 ఉంటుంది. అలాగే 12 జీబీ + 512 జీబీ ధర సుమారు రూ. 41,500, 16 జీబీ + 256జీబీ ధర సుమారు రూ. 39,000గా ఉంటుంది. 16 జీబీ + 512 జీబీ ధర సుమారు రూ. 43,000, 16 + 1 టీబీ ధర సుమారు రూ. 50,000గా ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్ షాడో, చి గువాంగ్ వైట్, సూపర్ పిక్సెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 1440 x 3168 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.82 అంగుళాల 2కే 8టీ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే ద్వారా 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ అంటూ బెంచ్‌మార్క్‌లో 3.3 మిలియన్లకు పైగా స్కోర్ చేసింది. మెరుగైన పనితీరు కోసం క్యూ2 గేమింగ్ చిప్ కూడా ఆన్‌బోర్డ్‌లో ఉంది.
ఫోటోగ్రఫీ కోసం నియో 10 ప్రో ప్లస్ 50 ఎంపీ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఆకట్టుకుంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 7కే ఐస్ డోమ్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఆరిజిన్ ఓఎస్‌తో ఆండ్రాయిడ్-15 ఆధారంగా పని చేస్తుంది. 120 వాట్ష్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6800 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఈ ఫోన్ 5జీ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ మరిన్ని ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి