iQOO భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించబోతోంది. దీనికి iQOO 13 అని పేరుతో అందుబాటులోకి తీసుకువస్తోంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు చివరకు కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ డిసెంబర్ 3 న భారతదేశంలో లాంచ్ కానుంది. AnTuTu స్కోర్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్, ఇతర వివరాలతో ఉన్న ఈ ఫోన్ గురించి ఇప్పుడు చాలా సమాచారం బయటకు వస్తోంది. నివేదికల ప్రకారం, iQOO 13 భారతీయ వెర్షన్ చైనాలో ప్రారంభించిన ఫోన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, దీని బ్యాటరీలో కొన్ని మార్పులు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోని వివో గ్రేటర్ నోయిడా సపోర్ట్‌తో తయారు చేస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తీసుకువస్తోంది.
5 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ మద్దతు:
కంపెనీ IQ 13లో 5 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 4 OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు ఉంటాయి. ఈ ఫోన్‌ను సరికొత్త Android OS వెర్షన్ Android 15 అవుట్ ఆఫ్ బాక్స్‌తో లాంచ్ చేయగలదని తెలుస్తోంది. ఎందుకంటే కంపెనీ ఈ ఫోన్‌ను Android 15 OSతో మాత్రమే చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ భారతదేశంలో కూడా Android 15 OSతో ప్రారంభిస్తే ఈ ఫోన్ Android 19 వరకు అప్‌డేట్‌లను పొందుతుంది.
బెంచ్‌మార్క్ టెస్టులో స్కోర్ అద్భుతం:
ఇది కాకుండా, iQoo 13 AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో 30 లక్షలకు పైగా స్కోర్ చేసింది. అంటే ఇది గొప్ప ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా మారబోతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ 7000mm² VC కూలింగ్ సిస్టమ్‌తో అందించనుంది. ఇది ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది. ఇది అల్ట్రా స్లిమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. దీని మందం 0.813 సెం.మీ. ఫోన్ IP68+IP69 సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే వినియోగదారులు తడి చేతులతో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఈ అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో పాటు, ఫోన్ ప్రాసెసర్ గురించిన సమాచారం కూడా ప్రకటించింది. Vivo సబ్-బ్రాండ్ కంపెనీ iQ తన ఫోన్ iQOO 13 ను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో లాంచ్ చేస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి