iPhone 13 Launch Event: సెప్టెంబర్ 14న ఆపిల్ ఈవెంట్.. ఐఫోన్ 13, వాచ్ సిరీస్ 7, ఎయిర్‌పాడ్స్ 3 విడుదల చేసే అవకాశం.. లైవ్ ఎలా చూడాలో తెలుసా?
iPhone 13 Launch Event: ఆపిల్ ఐఫోన్ 13 ని సెప్టెంబర్ 14 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుంది.
iPhone 13 Launch Event: ఆపిల్ ఐఫోన్ 13 ని సెప్టెంబర్ 14 న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ వర్చువల్‌గా జరగనుంది. దీనికి కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్ అని పేరు పెట్టారు. ఐఫోన్ 13 ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 7 స్మార్ట్‌వాచ్‌తోపాటు ఎయిర్‌పాడ్స్ 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 13 నాలుగు మోడళ్లను ఈవెంట్‌లో లాంచ్ చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 13 మినీ (iPhone 13 Mini), ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro), ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ (iPhone 13 Pro Max) ఉన్నాయి.
ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్.. ఆపిల్ కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్ సెప్టెంబర్ 14 న మనదేశం కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరగనుంది. దీనికి ఆపిల్ ఈవెంట్ పేజీ, ఆపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రసారం చేయనున్నారు. స్ట్రీమింగ్ ప్రత్యక్షంగా చూడాలనుకునే వినియోగదారులు నోటిఫికేషన్‌ల కోసం ముందుగానే రిమైండర్‌లను సెట్ చేయవచ్చు.
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఫీచర్లు (అంచనా) ఐఫోన్ 13 వచ్చే వారం జరిగే ఆపిల్ ఈవెంట్‌లో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఐఫోన్ 13 సిరీస్‌లోని ఫోన్ల స్టోరేజ్, కలర్ ఆప్షన్‌లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఉక్రేనియన్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీల వివరాలు పొందుపరిచారు. ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 13 మినీ (iPhone 13 Mini) 64 జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 12 256జీబీ మోడల్ రూ. 78,950, ఐఫోన్ 12 మినీ రూ. 69,900 రెండింటిలోనూ టాప్-ఎండ్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. అయితే ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Pro), ఐఫోన్ 13 ప్రో మాక్స్( iPhone 13 Pro Max) 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆఫ్షన్‌లలో లభించనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ కోసం 1 టీబీ స్టోరేజ్ మోడల్ ఉండవచ్చని రూమర్ మిల్ సూచించింది.
ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, ప్రొడక్ట్ (రెడ్), వైట్ కలర్స్‌లో లభించనున్నాయి. పింక్ కలర్ మోడల్ ఈసారి కొత్తగా ఉండవచ్చు అని తెలుస్తోంది. అయితే ఇతర కలర్ వేరియంట్‌లు గత సంవత్సరం ఐఫోన్ 12 మోడళ్లకు సమానంగా ఉండనున్నాయి.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఇతర వైపున, బ్లాక్, సిల్వర్, గోల్డ్, కాంస్యం రంగులలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇవి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో లభించే గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ షేడ్స్‌కి భిన్నంగా ఉంటాయని పేర్కొంది.
ఐఫోన్ 13 ప్రో మాక్స్ గత సంవత్సరం మోడల్ కంటే 18-20% పెద్ద బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ప్రో మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించవచ్చు. కానీ తక్కువ పవర్ మోడ్‌లో 60Hz వద్ద పనిచేసేలా సెట్ చేసుకోవచ్చు
ఐఫోన్ 13 ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సిస్టమ్‌కు సపోర్ట్ చేసే పోర్ట్రెయిట్ సినిమాటిక్ వీడియో ఫీచర్‌తో రావచ్చని తెలుస్తోంది. దీనితో, వీడియోను రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయగలరు. హార్డ్‌వేర్ సపోర్ట్ ఐఫోన్ 13 ను సెల్యులార్ కవరేజ్ లేకపోయినా, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా కాల్స్ చేయగలరు.
చిప్ ధర పెరుగుదల కారణంగా, ఐఫోన్ 13 ధర కూడా పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఫేస్ ఐడీ టెక్నాలజీ ఐఫోన్ 13 లో కూడా పనిచేసింది. దీని సహాయంతో, మీరు మాస్క్‌తో ఉన్నా కూడా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
ఆపిల్ వాచ్ సిరీస్ 7 యొక్క స్పెసిఫికేషన్‌లు ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు, కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్‌లో యాపిల్ ఆపిల్ వాచ్ సిరీస్ 7 ని కూడా లాంచ్ చేయవచ్చు. కొత్త ఆపిల్ వాచ్ (Apple Watch) మోడల్ ఫ్లాట్ డిస్‌ప్లేతోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది గత సంవత్సరం యాపిల్ వాచ్ సిరీస్ 6 కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 లో బ్యాటరీని మరింత మెరుగుపరిచినట్లు తెలుస్తోంది.
ఎయిర్‌పాడ్స్ 3.. మూడవ తరం ఎయిర్‌పాడ్స్‌లో, ఇయర్‌ఫోన్‌లను ఆపిల్ ఈవెంట్‌లో లాంచ్ చేయవచ్చు. ఇవి ఎయిర్‌పాడ్స్ ప్రో వంటి డిజైన్‌తో రావచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుతో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Also Read:
Wipro WFH Ends: విప్రోలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ముగింపు.. ఇక వారంలో రెండ్రోజులు ఆఫీస్‌కు..