uppula Raju |
Updated on: Sep 12, 2021 | 10:20 PM
అత్యవసర పరిస్థితిలో కదులుతున్న రైలును ఆపడానికి బోగీలో చైన్ సౌకర్యం కల్పించారు. దీనిని లాగితే ట్రైన్ ఆగిపోతుంది. కానీ అనవసరంగా లాగితే రైల్వే సెక్షన్ల కింద శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
కొంతమంది స్టాప్ లేకున్నా స్టేషన్‌కి ముందు చైన్ లాగుతారు. దిగి పారిపోవాలనుకుంటున్నారు. కానీ రైల్వే పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకుంటారు.
చైన్ లాగినప్పుడు బ్రేక్ పైప్ నుంచి గాలి పీడనం విడుదల అవ్వడం వల్ల బ్రేకులు అప్లై అవుతాయి. దీంతో రైలు సడెన్‌గా ఆగిపోతుంది.
ఏదైనా బోగి నుంచి చైన్ లాగితే పెట్టెకు ఇరువైపులా ఉన్న చార్ట్ కమ్ ప్యాసింజర్ అలారం లైట్ వెలుగుతుంది. దీంతో ఏ పెట్టె నుంచి చైన్ లాగారో గార్డు లేదా రైల్వే పోలీసులకు తెలుస్తుంది.