
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. లక్షలాది ఆండ్రాయిడ్ పరికరాలు మాల్వేర్, డేటా చోరీ ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 42 శాతం మంది వినియోగదారులు ఇప్పటికీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌ల ఫోన్‌లనే ఉపయోగిస్తున్నారని.. ఈ ఫోన్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల వాళ్ల డేటా రిస్క్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. కాబట్టి ఆండ్రాయిడ్ కూడా ఆపిల్ తరహా సెక్యూరిటీ మార్పులు అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
లక్షలాది మంది యూజర్స్ భద్రతా హెచ్చరిక: మిలియన్‌ల కొద్ది ఆండ్రాయిడ్ యూజర్స్ డేటా రిస్క్‌లో ఉందని గూగుల్ తెలిపింది. కొత్త వెర్షన్లు ఎలా పని చేస్తున్నాయో, ఎంత మంది వినియోగదారులు తాజా వెర్షన్లను ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేయడానికి కంపెనీ తన ఆండ్రాయిడ్ డిస్ట్రిబ్యూషన్ చార్ట్‌లను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది.
కాలం చెల్లిన వెర్షన్లు: ప్రస్తుతం లక్షలాది మంది యూజర్స్ ఇప్పటికీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లనే ఉపయోగిస్తున్నారు. సుమారు 58 శాతం మంది మాత్రమే ఆండ్రాయిడ్ 13 వర్షన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో మాత్రమే సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉన్నాయని.. ఆండ్రాయిల్ 12 వర్షన్‌లో ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ లేవని చెబుతున్నారు. గూగుల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 తర్వాతి వర్షన్స్ సెక్యూరిటీస్‌ను మాత్రుమే కవర్ చేస్తున్నట్టు తెలిపింది.
ఆపిల్ – ఆండ్రాయిడ్: పాత పోన్‌లకు సైతం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వడంతో మార్కెట్‌లో ఆపిల్ అగ్రగామిగా నిలుస్తోంది. అవును ఆపిల్ సంస్థ పాత ఫోన్‌లకు కూడా ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. దీని ఈ ఫోన్‌లు సైబర్ నేరాల బారీన పడకుండా ఉంటున్నాయి. అయితే ఆండ్రాయిడ్ మాత్రం కేవలం కొత్త ఫోన్‌లలో మాత్రమే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇస్తుంది. పాత వాటిలో ఇవ్వడం మానేసింది. కాబట్టి ఆండ్రాయిడ్‌తో పోలిస్తే.. సెక్యూరిటీ పరంగా ఆపిల్ సుక్షితమని నిపుణులు అంటున్నారు.
భద్రతా లోపం: యూజర్స్‌లో ఎక్కవ శాతం ఓల్డ్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడడం చాలా ఆందోళనకు కలిగిస్తోంది. సరైన సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వకపోతే ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా మాల్వేర్ దాడులకు, సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంది.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.