వాట్సాప్ వినియోగదారులకు మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్‌టీ) వాట్సాప్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం అవకాశం ఉండటమే కాకుండా.. సైబర్ దాడికి కూడా గురయ్యే ప్రమాదం ఉందని సీఈఆర్‌టీ యూజర్లను హెచ్చరిస్తోంది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32లలో లోపాన్ని గుర్తించామని తెలిపింది. ఆయా వెర్షన్లను వెంటనే అన్-ఇన్‌స్టాల్ చేసి లేటెస్ట్ అప్దేటెడ్ వెర్షన్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. అటు వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ విధానం ఎక్కువ డేటాను సేకరిస్తోందని.. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం కాకుండా యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
కాగా, వాట్సాప్ అప్‌డేటెడ్ ప్రైవసీ పాలసీ మే 15 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం కొత్త పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను బ్యానర్ రూపంలో యూజర్ ముందు ప్రదర్శిస్తుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించనివారు మే 15 తర్వాత మెసేజీలు పంపలేరు. అయితే కాల్స్, నొటిఫికేషన్స్ మాత్రం వస్తాయి. భారతీయ చట్టాలకు లోబడే ప్రైవసీ పాలసీని రూపొందించినట్లు కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇచ్చిన విషయం విదితమే.
ఆ వ్యాధి ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువ.. తస్మాత్ జాగ్రత్త.! హెచ్చరిస్తున్న వైద్యులు..
మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..
కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూరలో నక్కిన పాము.. భయానక వీడియో.!