Carbon X21: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య పోటీ బాగా పెరుగుతోంది. దీంతో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఇక ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే కనీసంలో కనీసం రూ. 20,000 వేలకు పైమాటే కానీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల ధరలు బాగా తగ్గాయి. ఎన్నో అద్భుత ఫీచర్లతో కూడిన ఫోన్లు రూ. 10 లోపు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ భారతీయ సంస్థ కార్బన్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. కార్బన్ ఎక్స్21 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర రూ. 4,999కే అందుబాటులోకి రావడం విశేషం. స్మార్ట్ ఫోన్ వేరియంట్‌లో తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
* ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
* కార్బన్ ఎక్స్ 21: 2 జీబీ ర్యామ్ + 32 బీజీ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులోకి తీసుకొచ్చారు.
* 5.45 ఇంచుల హెచ్‌డీ+ఎల్సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
* ఈ ఫోన్ యూనిసోక్ ఎస్సీ 9863 ప్రాసెసర్‌తో నడుస్తుంది.
* స్క్రీన్ రిజల్యూషన్ విషయానికొస్తే.. 1440x 720గా అందించారు.
* 8 మెగా పిక్సెల్ కెమెరా (రెయిర్), 5 మెగా పిక్సెల్ (సెల్ఫీ) ఈ ఫోన్ సొంతం.
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
Also Read: WhatsApp Update: ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. స్టిక్కర్లను గుర్తించడం మరింత సులభం!