Electric Car: ఇండియాలో ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు ఇదే..! టాప్ స్పీడ్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..

|

Oct 26, 2021 | 10:04 AM

Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. భారతీయ EV స్టార్టప్ వజిరాణి దేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్

Electric Car: ఇండియాలో ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ కారు ఇదే..! టాప్ స్పీడ్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..
Fastest Car Of India
Follow us on

Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. భారతీయ EV స్టార్టప్ వజిరాని (Vazirani Automotive) దేశంలోనే అత్యంత వేగవంతమైన సింగిల్-సీట్ హైపర్‌కార్‌ను పరిచయం చేసింది. ఈ కారు పేరు ఎకోంక్ (Ekonk). ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఇదొకటి. డిజైన్, లుక్ గురించి చెప్పాలంటే ఈ కారు UFO రేసింగ్ కారులా కనిపిస్తుంది. దీని బరువు 738 కిలోలు. స్టార్టప్ EV ఇందులో కొత్త బ్యాటరీ సొల్యూషన్‌ను ఉపయోగించింది. హైపర్‌ కారులలో సంప్రదాయ సంక్లిష్ట లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని భర్తీ చేసింది.

డికో టెక్నాలజీపై దూసుకుపోతుంది
ఈ హైపర్‌ కార్‌లో డికో అనే సాంకేతికతను ఉపయోగించారు. ఇది బ్యాటరీలను నేరుగా గాలి ద్వారా చల్లబరుస్తుంది. దీనికి ద్రవ శీతలీకరణ అవసరం లేదు. ఈ సాంకేతికత ఈ ఎలక్ట్రిక్ కారును తేలికగా, వేగవంతమైన, సురక్షితమైనదిగా మార్చింది.

ఎకోంక్ ఇంజిన్ & పవర్
ఎకాంక్ హైపర్‌ కార్ ఇంజన్ 722 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇండోర్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన నాక్స్‌ట్రాక్స్ హై-స్పీడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్‌లో ఈ ఎలక్ట్రిక్ హైపర్‌ కారుని పరీక్షించారు. ఇది గరిష్టంగా 309 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 2.54 సెకన్లలో 0 నుంచి100 kmph వేగాన్ని అందుకుంటుంది.

ఎకోంక్ అనే పేరు ప్రత్యేకమైనది
ఎకోంక్ అనే పదానికి ప్రత్యేక అర్థం ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఆటోమొబైల్‌ రంగంలో సరికొత్త నాంది పలుకుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో ప్రపంచం మొత్తం మారబోతుందని వజిరాని-ఆటోమోటివ్ వ్యవస్థాపకుడు CEO చుంకీ వజిరాణి అన్నారు.

Chanakya Niti: ఈ 5 విషయాలు గుర్తించుకోండి.. ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.!

NEET UG 2021 ఫేజ్ 2 నమోదుకు ఈ రోజే ఆఖరు తేదీ.. ఫలితాలు కూడా ఈ నెలలోనే..!

PM Kisan: రైతులకు గుడ్‏న్యూస్.. ఇకపై 2 వేలు కాదు.. 4 వేలు.. ఏకంగా రూ. 12 వేలు ఖాతాల్లోకి.. ఎప్పుడంటే..

Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..