సాధారణంగా ప్రతి ఇంట్లో టీవీ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. ఇటీవల కాలంలో మారిన టెక్నాలజీ కారణంగా టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా రూపాంతరం చెందాయి. అలాగే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ, ఫోన్‌కు నెట్ అనేది కావాల్సి వస్తుంది. ముఖ్యంగా సాంప్రదాయ కేబుల్ టీవీ పోయి సూపర్ స్పీడ్ నెట్‌తో స్మార్ట్ టీవీలు పని చేస్తున్నాయి. అయితే సమస్య మొత్తం వీటి కోసం వాడే వైరింగ్‌తోనే వస్తుంది. ముఖ్యంగా గదుల్లో నెట్ కోసం వైరింగ్ లాక్కోవడం గగనంగా మారింది. ఇల్లు మారిన సమయంలో వీటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను తీర్చేలా జియో పెయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించింది. ఈ సేవలపై పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జియో ఎయిర్‌ఫైబర్ అనేది రిలయన్స్ జియోకు సంబంధించిన కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ముఖ్యంగా గృహ వినోదం, స్మార్ట్ హోమ్ సేవలు, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అవసరాలను తీర్చడానికి రూపొందించారు. భారతదేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో జియో ఎయిర్‌ఫైబర్ మొదట ఎనిమిది నగరాల్లో ప్రారంభించారు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు ప్రారంభించారు. జియో ఎయిర్‌ఫైబర్ తల్లిదండ్రుల నియంత్రణలు, వైఫై-6కి మద్దతు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మీరు కొత్త జియోఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని పొందాలని కూడా ఆలోచిస్తుంటే ఎలా బుక్ చేయాలి? ప్లాన్స్ వివరాలు ఏంటి? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
జియో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని అందిస్తుంది. కాబట్టి వినియోగదారులు జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లు, ఇన్‌స్టాలేషన్ ఫీజు కోసం మాత్రమే చెల్లించాలి.
ఈ ప్లాన్స్‌లో జియో వరుసగా రూ. 599, రూ. 899, రూ. 1199 ధరలతో మూడు ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వేగవంతమైన ఇంటర్నెట్, 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. రూ.1199 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
ఈ ప్లాన్స్‌లో జియో వరుసగా రూ. 1499, రూ. 2499, రూ. 3999 ధరలతో మూడు ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గరిష్టంగా 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ డేటా వేగం, 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం, వంటి 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..