NASA Magic Cup: అంతరీక్ష యానంలో కాఫీ తాగాలంటే ఇలాంటి కప్పు ఉండాల్సిందే.. వైరల్ అవుతున్న నాసా వీడియో..

| Edited By: Janardhan Veluru

Mar 21, 2023 | 4:17 PM

అంతరిక్షం అనేది మనిషికి ఎప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే… రోదసిలో ఎన్ని విషయాలను మనం తెలుసుకున్నప్పటికీ అవి ఇసుక రేణువుతో సమానం అని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు.

NASA Magic Cup: అంతరీక్ష యానంలో కాఫీ తాగాలంటే ఇలాంటి కప్పు ఉండాల్సిందే.. వైరల్ అవుతున్న నాసా వీడియో..
Nasa's Magic Cup
Follow us on

మనిషి ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టడం నుంచి నేడు రాకెట్లతో ఇతర గ్రహాలకు చేరుకోవడం వరకూ గమనించినట్లయితే, అంతరిక్ష యానంలో ఎన్నో మెట్లు ఎక్కినట్లే కనిపిస్తూ ఉంటుంది. కానీ నేటికీ కూడా అంతరిక్షంలో ఎన్నో చిక్కుముడులు మనిషికి సవాళ్లు విసురుతూ నాసా ఇస్రో వంటి సంస్థలు నిరంతరం అంతరిక్ష పరిశోధనలు చేస్తూ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి కోసం నిత్యం తోడ్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యోమగాములు తమ ప్రాణాలకు తెగించి మరి అంతరిక్షంలోకి వెళ్లి అనేక వింతలు విశేషాలను మనకు తెలియజేస్తూ ఉంటారు.

అలాగే అంతరిక్షంలో జీవించడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలో దాదాపు శూన్యం. ఆకర్షణ శక్తి లేకపోతే మంచినీళ్లు కూడా తాగలేము. అలాగే మన శరీర బరువు కూడా దాదాపు శూన్యం అయిపోయి గాలిలో తేలుతూ ఉంటాము. మరి ఇలాంటి సవాళ్లను అధిగమించడానికి శాస్త్రవేత్తలు అంతరిక్షంలో వ్యోమగాములు ఉపయోగించే అనేక వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు వ్యోమగాములు తాగేందుకు ఓ కాఫీ కప్పును తయారు చేశారు. దాని గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

అంతరిక్ష పరిశోధనల కోసం రాకెట్లలో రోదసిలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ నెలల తరబడి ఉండాల్సి ఉంటుంది. అందుకే వారు అక్కడ జీవించేందుకు ప్రతీ చిన్న అవసరాన్ని గుర్తించి అన్ని రకాల వస్తువులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతరిక్షంలో వ్యోమగాములు తాగే నీరు, ఆహారం, అలాగే ప్రత్యేకమైన ద్రవపదార్థాలు, ప్రత్యేకమైన దుస్తులు, పెన్నులు, పరికరాలు ఇలా ప్రతీ వస్తువును అంతరిక్షంలోని పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రవేత్తలు తయారు చేస్తుంటారు. తాజాగా వ్యోమగాములు నీరు, కాఫీ, టీ తాగేందుకు ప్రత్యేకమైన కప్పును తయారు చేశారు. నాసా శాస్త్రవేత్తలు తయాచు చేసిన ఈ స్పేస్ కప్ ఉఫయోగించి వ్యోమగాములు సులభంగా కాఫీ తాగగలుగుతున్నారు.

 

జీరో గ్రావిటీలో కప్పులో పోసిన ద్రవపదార్థాలు గాల్లో ఎగిరిపోకుండా ఉండేలా ఓ ప్రత్యేకమైన స్పేస్ కప్‌ను నాసా డిజైన్ చేయించింది. ఇందులో కాఫీ, టీ, జ్యూస్, సూప్ వంటివి పోసినా కూడా అవి గాల్లో తేలిపోకుండా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

తాజాగా నికోల్ మాన్ అనే వ్యోమగామి అంతర్జాతయ స్సేస్ సెంటర్ నుంచి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో స్పేస్ కప్‌ డెమో చేసి చూపించింది. విచిత్రంగా ఈ స్పేస్ కప్‌లో పోసిన కాఫీ ఎలాంటి గ్రావిటీ లేకపోయినా కదలకుండా అందులోనే ఉండిపోయింది. ఈ వింత చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నికోల్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్పేస్ కప్‌లో కాఫీ పోసి దాన్ని తిరగేసిన ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా ఉండటం విశేషం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..