AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Gift Ideas: మీ చెల్లి మీకు రాఖీ కడితే.. మీరు ఈ ట్రెండీ గ్యాడ్జెట్‌ను తన చేతికి పెట్టండి.. షాక్ అయిపోవడం ఖాయం..

మీరు రాఖీ పండుగ రోజు మీ ఇంట్లో ఆడపడచులతో రాఖీ కట్టించుకొని మంచి ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇస్తే వారు ఆనందానికి అవధులుండవు. మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ ఇవ్వాలనుకుంటే సూపర్ ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. మీ జేబుకు చిల్లు పడకుండా తక్కువ ధరలోనే మంచిచ ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనేసి మీరు గిఫ్ట్ గా ఇచ్చేయొచ్చు. పలు వాచ్ లపై దాదాపు 83శాతం వరకూ ఫ్లిప్ కార్ట్ మీకు ఆఫర్లను అందిస్తోంది.

Rakhi Gift Ideas: మీ చెల్లి మీకు రాఖీ కడితే.. మీరు ఈ ట్రెండీ గ్యాడ్జెట్‌ను తన చేతికి పెట్టండి.. షాక్ అయిపోవడం ఖాయం..
Rakhi Surprise Gift For Sister
Madhu
|

Updated on: Aug 28, 2023 | 1:30 PM

Share

రాఖీ పండుగ సమీపించింది. ఆడపడుచులు మంచి రాఖీలు కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. మంచి రాఖీలు కట్టేసి, అన్నలు తమ్ముళ్ల నుంచి మంచి గిఫ్ట్ లుకొట్టేయాలని తలపోస్తున్నారు. అయితే వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి? అని ఎలాంటిది ఇస్తే ఇంట్లో చెల్లెళ్లు, లేదా అక్కలు ఆనందపడతారు? చాలా పెద్ద ప్రశ్నే. అయితే మీకో సింపుల్ సమాధానం మా వద్ద ఉంది. అదేంటంటే స్మార్ట్ వాచ్. ప్రస్తుత ట్రెండీ ఐటెం ఇదే. మీరు రాఖీ పండుగ రోజు మీ ఇంట్లో ఆడపడచులతో రాఖీ కట్టించుకొని మంచి ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇస్తే వారు ఆనందానికి అవధులుండవు. మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ ఇవ్వాలనుకుంటే  ఫ్లిప్ కార్ట్ లో సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ జేబుకు చిల్లు పడకుండా తక్కువ ధరలోనే మంచిచ ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ కొనేసి మీరు గిఫ్ట్ గా ఇచ్చేయొచ్చు. పలు వాచ్ లపై దాదాపు 83శాతం వరకూ ఫ్లిప్ కార్ట్ మీకు ఆఫర్లను అందిస్తోంది. ఆ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడ చూద్దాం..

ఫైర్ బోల్ట్ నింజా కాలింగ్ ప్రో.. ఆస్మార్ట్ వాచ్ పై ఏకంగా 83శాతం డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. దీని వాస్తవ ధర రూ. 7,999కాగా, ఇప్పుడు దీనిని మీరు కేవలం రూ. 1,299కే సొంతం చేసుకోవచ్చు. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మోనిటరింగ్, స్టెప్స్, డిస్టెన్స్ ట్రావెల్డ్, కేలరీస్ బర్న్ట్ వంటి ఫిట్నెస్ ట్రాకర్లు కూడా ఉన్నాయి.

నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ 2.. ఈ స్మార్ట్ వాచ్ పై మీకు 73శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 5,999కాగా కేవలం రూ. 1599కే దీనిని సొంతం చేసుకోవచ్చు. దీనిలో కూడా బ్లడ్ ఆక్సిజెన్, 24/7 హార్ట్ రేట్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్, స్లీప్ మోనిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఫైర్ బోల్ట్ అపోలో 2.. ఈ స్మార్ట్ వాచ్ పై ఫ్లిప్ కార్ట్ 78శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. వాస్తవంగా దీని ధర రూ. 7,990 కాగా రూ. 1,699కే కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో 1.69 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే 2.5డీ కర్వ్ డ్ టచ్ ఉంటుంది. హై క్వాలిటీ విజువల్స్ దీనిలో మీరు చూడొచ్చు. దీనిలో 10 కాంటాక్ట్ ల వరకూ కూడా సేవ్ చేసుకోవచ్చు.

యాంబ్రేన్ వైజ్ ఈయాన్ మ్యాక్స్.. ఈ స్మార్ట్ వాచ్ పై ఫ్లిప్ కార్ట్ 78శాతం తగ్గింపును అందిస్తోంది. దీని ధర రూ. 5,999కాగా కేవలం రూ. 1,299కే కొనుగోలు చేయొచ్చు. దీనిలో 5.1 సెంటీమీటర్ల ల్యూసిడ్ డిస్ ప్లే ఉంటుంది. పలు హెల్త్ ట్రాకర్లు ఉంటాయి. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, స్లీప్, బ్రీత్ ట్రాకింగ్, మెన్ స్ట్రుల్ సైకిల్ ట్రాకింగ్ వంటివి ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..