ల్యాప్ టాప్‌లో బ్యాటరీ చార్జింగ్ వెంటనే తగ్గిపోతోందా..? ఎందుకిలా జరుగుతుందో గుర్తించారా..? ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ ఉంటున్నాయి. కరోనా నుంచి ఇంటి నుండి పని చేయడం వల్ల ల్యాప్‌టాప్ వాడకం పెరిగింది. ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు తరచుగా బ్యాటరీతో సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, ల్యాపీ వినియోగం పెరిగిపోవడంతో దాని జీవితకాలం కూడా రోజు రోజుకు తగ్గిపోతోంది. ముఖ్యంగా మీ ల్యాప్‌టాప్ పాతబడటం ప్రారంభించినప్పుడు.. అందుకే మీరు ఎప్పటికప్పుడు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ అంటే బ్యాటరీ లైఫ్‌కి సంబంధించిన హెల్త్ చెకప్‌ని చెక్ చేస్తూ ఉండాలి.
దీని కోసం కొన్ని చిన్న చిన్న టెక్నికల్ టిప్స్ ను మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు టెక్నిషియన్ వద్దకు పరుగులు పెట్టడం బాగుండదు. దీనికి తోడు చేబుకు చిళ్లు పడుతుంది. అందుకే కొన్ని ల్యాప్ టాప్ బ్యాటరీ టిప్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం..
మీ ల్యాప్‌టాప్ Windows 10ని నడుపుతుంటే, మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకోడానికి.. ముందుగా మీరు సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. దీని కోసం, విండోస్ సెర్చ్ లేదా స్టార్ట్ మెనూలో ‘cmd’ లేదా ‘కమాండ్ ప్రాంప్ట్’ని సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఫైల్ పాత్‌తో కూడిన విండోను కనిపిస్తుంది (C : డ్రైవ్). ఇది నలుపు రంగులో లేదా మరేదైనా రంగులో కూడా ఉండవచ్చు.
విండో తెరిచిన తర్వాత, ఇక్కడ powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా చేయడం వల్ల సేవ్ చేయబడిన బ్యాటరీ లైఫ్ టైమ్ రిపోర్ట్ మెసెజ్ మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనితో పాటు, స్క్రీన్‌పై ఫైల్ పాత్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు బ్యాటరీ రిపోర్ట్‌ను చూడవచ్చు. ఇది కాకుండా, మీరు యూజర్ ఫోల్డర్‌కి వెళ్లి C:Users[Your_User_Name]battery-report.html అని టైప్ చేయండి. ఆ తర్వాత వచ్చే బ్యాటరీ రిపోర్ట్ చూడవచ్చు.
మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా కూడా ఈ ఫోల్డర్‌ని చూడవచ్చు. ఈ సిస్టమ్ రూపొందించిన రిపోర్ట్‌లో బ్యాటరీ వినియోగం వారీగా గ్రాఫిక్స్ ద్వారా కనిపిస్తుంది. దీనితో పాటు బ్యాటరీ పూర్తి శక్తి, బ్యాటరీ ప్రస్తుత స్టేటస్ గురించిన సమాచారం తెలిసిపోతుంది.
ఇది కాకుండా, మీరు బ్యాటరీని, ల్యాప్ టాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో కూడా రిపోర్టు రికార్డు చేస్తుంది. దీనితో పాటు, మీరు ల్యాప్‌టాప్ AC ఛార్జర్‌లో రన్ అయ్యే సమాచారాన్ని కూడా చూడవచ్చ. బ్యాటరీ, AC ఛార్జర్ రెండింటినీ పోల్చడం ద్వారా మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీ పవర్ కెపాసిటీ స్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ టిప్స్ మీ ల్యాప్ టాప్ లైఫ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.
Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం