Knowledge News: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 13మంది మరణించారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రతికూల వాతావరణంతో పాటు సాంకేతిక లోపమే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమంటున్నా అందులో నిజనిజాలు తెలియాల్సి ఉంది. ఇది తెలియాలంటే విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేయాల్సిందే. అసలు హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది? దీని వెనుక కారణాలేంటో తెలుసుకోవాలంటే ఇదే కీలకం. అందుకే ప్రమాదం జరిగినప్పటి నుంచి అధికారులు ఈ బ్లాక్ బాక్స్‌ను అన్వేషించగా ఇవాళ ఉదయం దొరికింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ బృందం గుర్తించింది. వింగ్ కమాండర్ ఆర్ భరద్వాజ్ నేతృత్వంలో 25 మంది సభ్యుల వైమానిక బృందం బ్లాక్‌బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు వెల్లింగ్టన్ బేస్ క్యాంప్‌కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించి, అందులో ఉన్న డేటా డీకోడ్ చేసే పనిలో ఉన్నారు.
అదే కీలకం..
కాగా బ్లాక్ బాక్స్‌లో మొత్తం13 గంటల డేటా నిక్షిప్తమై ఉంటుంది. ప్రమాదానికి ముందు.. క్రాష్ అవుతున్న సమయంలో విమానంలో ఏం జరిగిందన్న పూర్తి సమాచారం బ్లాక్ బాక్స్ ఇవ్వనుంది. అదేవిధంగా ప్రమాదానికి ముందు పైలెట్లు జరిపిన సంభాషణ కూడా రికార్డై ఉంటుంది. ఒక రకంగా ఇది ఇక కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిదని చెప్పవచ్చు. కాగా ప్రమాద సమయంలో పైలెట్లు ఏం మాట్లాడరన్నది కీలకంగా మారింది. కాగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా దృఢంగా ఉండేలా బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఎంత ప్రమాదం జరిగినా డేటా భద్రంగా ఉండేలా డిజైన్ చేస్తారు. రాడార్ సిగ్నల్స్ అందకపోయినా బాక్స్ మాత్రం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటుంది. అది ధ్వంసం కాకుండా వెనుకభాగంలో అమరుస్తారు. సులభంగా గుర్తించేందుకు వీలుగా ఆరెంజ్ కలర్ వేస్తారు. ప్రమాదానికి రెండు గంటల ముందు డేటా మొత్తం ఆ బ్లాక్‌బాక్స్‌లో ఉంటుంది. ఘటనకు ముందు ఏం జరిగిందో టేపుల ద్వారా అంచనా వేస్తారు.
డేటాను డీకోడ్ చేసి..
కాగా కోయంబత్తూరు ATC నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రమాదానికి కొద్దిసేపటి ముందు కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. అదే సమయంలో పొగమంచుతో కూడిన మేఘాలు కమ్మేశాయి. వేగంగా ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌కి ఎదురుగా ఏముందో తెలిసే పరిస్థితి లేదని ఏటీసీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొండల్లో ఉన్న చెట్లను ఢీకొట్టి మంటలతో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరుగుతుండగానే ఐదారుగురు మంటలతో పాటే కిందకు దూకేశారని ప్రత్యక్ష సాక్షులూ చెబుతున్నారు. ఈక్రమంలో హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా..? లేదంటే చెట్టు కొమ్మ తాకి మంటలొచ్చాయా? అసలేం జరిగిందన్నది తెలియాలంటే బ్లాక్ బాక్స్‌లో రికార్డయిన డేటా డీకోడ్ కావాల్సిందే..
Also Read:
Viral Video: మానవత్వం అంటే ఇదే.. నెటిజన్ల మనస్సు దోచుకుంటున్న బుడ్డోడు.. వీడియో వైరల్
Army Chopper Crash: ఆర్మీ సిబ్బంది మృతదేహాల గుర్తింపులో అలస్యం.. కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు