
ఈ రోజుల్లో ఈమెయిల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ఒప్పుడంటే సమాచారం చేరవేయడానికి ఉత్తరాలు వాడేది కాని.. ఇంటర్నెట్ వచ్చాక ప్రతి ఒక్కరు సమాచార మార్పిడికి ఈమెయిల్‌నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీస్ పలును, ప్రాజెక్టులు, ప్రజెంటేషన్స్ కోసం ఈమెయిల్‌ను ఎక్కవుగా వాడుతారు. ఈమెయిల్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది గూగుల్‌లో ఉండే జీమెయిల్. గూగుల్ తమ యూజర్స్‌కు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పికప్పుడూ కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జీమెయిల్ కూడా వాట్సాప్ తరహాలోనే కొన్ని అదిరిపోయే ఫీచర్లు తీసుకొచ్చింది.
చాలా మందికి తెలియని రహస్యం
ఈమెయిల్‌లోనే ఈ ఫీచర్ గురించి చాలా మందికి తెలియదు. మనం వాట్సాప్‌లో ఎలాగైతే వ్యూ వన్స్ అనే మెసేజ్‌లు పంపుతామో..ఈ జీమెయిల్‌లో కూడా చాలా మందికి తెలియని అలాంటి ఒక సీక్రెట్ ఫీచర్ ఉంది. దాన్నే కాన్ఫిడెన్షియల్ మోడ్ అని అంటారు. ఈ ఫీచర్‌ని యూజ్ చేసి మీరు ఎవరికైనా పంపిన మెసేజ్‌ను వాళ్లు ఎన్ని సార్లు ఓపెన్ చేయాలో సెట్ చేయవచ్చు. అంటే మీ మెయిల్‌కు ఒక పట్యూక్యులర్ టైమ్‌ను సెట్ చేస్తే.. ఆ ముగిసిన తర్వాత వేరే వాళ్లు ఎంత ట్రై చేసినా ఆ మెయిల్ ఓపెన్ చేయలేరు.
అంతేకాదు.. మీరు కావాల్సినప్పుడూ మీరు ఆమెయిల్‌ను డిలీట్ కూడా చేయవచ్చు. మీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని ఇందుకో ఓటీపీ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.ఇది ఎలా పనిచేస్తుంది అంటే.. మీరు పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి ఓపెన్ చేయాలి అంటే కచ్చితంగా ఓటీపీ అవసరం అవుతుంది. ఓటీపీ లేకుండా మీ మెయిల్ ఓపెన్ చేయడం అసాధ్యం. బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, రహస్య పత్రాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని పంపేటప్పుడు జీమెయిల్ లోని ఈ ఫీచర్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఇది సైబర్ నేరగాళ్ల నుంచి కూడా మిమ్మల్ని ప్రోటెక్ట్ చేస్తుంది.
జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఎలా ఆన్ చేసుకోవాలి?
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలరీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.