Valenties Day: ఏ సందర్భమైనా సరే వాట్సాప్‌లో విషెస్ చెప్పడం ఇటీవల సాధారణంగా మారింది. అయితే కేవలం మెసేజ్ రూపంలో శుభాకాంక్షలు తెలపడం కంటే స్టిక్కర్ల రూపంలో విషెస్ చెప్పడం ఇప్పుడు ఒక ట్రెండ్. ఇందుకు అనుగుణంగానే ప్రతీ సందర్భానికి తగిన స్టిక్కర్లు అందుబాటులో ఉంటున్నాయి. మరి సోమవారం జరగబోయే ప్రేమికుల దినోత్సవానికి కూడా మీకు నచ్చిన వారికి వాట్సాప్ స్టిక్కర్ల రూపంలో విషెస్ ఎలా చెప్పాలి.? స్కిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం…
* ఇందుకోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాలంటైన్స్ డే స్టిక్కర్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
* అనంతరం స్టిక్కర్లకు సంబంధించిన యాప్స్ కనిపిస్తాయి.
* వాటిలో మీకు నచ్చిన ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత వాట్సాప్‌కు యాడ్ చేయాలనుకునే స్టికర్లను సెలక్ట్ చేసుకోవాలి.
* అనంతరం స్టిక్కర్ వద్ద ‘యాడ్ టూ వాట్సాప్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో స్టిక్కర్స్ వాట్సాప్‌కు యాడ్ అవుతాయి.
* తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి.. మీరు ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేసి ఎమోజీ సింబల్‌పై క్లిక్ చేయాలి.
* చివరిగా స్టిక్కర్ సింబల్‌పై క్లిక్ చేస్తే.. అంతకుముందు మీరు యాడ్ చేసిన వాలంటైన్ డే స్టిక్కర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్‌ను పంపించుకోవచ్చు.
Also Read: Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..