Watermelon: రసాయనాలు కలిగిన పుచ్చకాయను గుర్తించడం ఎలా? పిల్లలపై ఎలాంటి ప్రభావం.. వీడియో చూడండి

వేసవి కాలం ప్రారంభం కాగానే పుచ్చకాయలు మార్కెట్‌లో విరివిగా అందుబాటులోకి వస్తాయి. సమ్మర్‌ సీజన్‌లో పుచ్చకాయలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటంతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ..

Watermelon: రసాయనాలు కలిగిన పుచ్చకాయను గుర్తించడం ఎలా? పిల్లలపై ఎలాంటి ప్రభావం.. వీడియో చూడండి
Watermelon
Follow us
Subhash Goud

|

Updated on: Apr 13, 2024 | 4:54 PM

వేసవి కాలం ప్రారంభం కాగానే పుచ్చకాయలు మార్కెట్‌లో విరివిగా అందుబాటులోకి వస్తాయి. సమ్మర్‌ సీజన్‌లో పుచ్చకాయలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటంతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని తింటారు. కానీ అన్ని పండ్ల మాదిరిగానే ఇది కూడా రసాయనాలతో ఇంజెక్ట్ చేస్తున్నారు. అయితే రసాయనాలు కలిగివున్న పుచ్చకాయను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.

ఇలా గుర్తించండి: 

రసాయనాలు కలిగిన పుచ్చకాయలను ఎలా గుర్తించాలో వివరిస్తూ FSSAI ఒక వీడియోను విడుదల చేసింది. దీని సహాయంతో మీరు మీ ఆరోగ్యాన్ని హాని నుండి కాపాడుకోవచ్చు. పుచ్చకాయలోని రసాయనాన్ని గుర్తించాలంటే ముందుగా పుచ్చకాయను రెండు భాగాలుగా కోయాలి. తర్వాత కాటన్ బాల్స్ తీసుకుని ఎర్రటి గుజ్జు ఉన్న ప్రదేశంలో నొక్కండి. కాటన్ బాల్స్ ఎర్రగా మారితే పుచ్చకాయకు రసాయనాల రంగు వేసినట్లు అర్థం. పుచ్చకాయకు రసాయనాలు కలుపడం వల్ల దాని రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఒక వేళ అందులో ఎలాంటి రసాయనాలు లేకుంటే దానిపై రుద్దిన కాటన్ ఎలాంటి రంగు మారదు. ఇలా ఎరుపు రంగు ఉన్న పుచ్చకాయలనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అధ్యయనం ప్రకారం.. ఎరుపు రంగు కోసం ఉపయోగించే రంగులో కనిపించే ఎరిత్రోసిన్ అనే రసాయనాన్ని ఎక్కువసేపు ఉపయోగించడం పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది. అలాగే అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

పండ్లను పండించడానికి దాదాపు అన్ని పండ్లలో కార్బైడ్ ఉపయోగిస్తారు. పుచ్చకాయపై తెల్లటి పొడి వంటి పదార్థం కనిపిస్తే, అది కార్బైడ్ కావచ్చు. నీటితో బాగా కడిగిన తర్వాత మాత్రమే దానిని కట్‌ చేసుకుని తినడం మంచిదంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?