Redmi Pad Pro: మరో ట్యాబ్ రిలీజ్ చేసిన ఎంఐ.. తక్కువ ధరలో సూపర్ స్పెసిఫికేషన్లు

తాజాగా చైనాకు సంబంధించిన  ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన రెడ్ మీ మరో ట్యాబ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రెడ్‌మీ టర్బో 3 పేరుతో ఇటీవల చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్- 2 ఎస్ఓసీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12.1 అంగుళాల 2.5 కే రిజల్యూషన్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉన్నాయి. ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంది.

Redmi Pad Pro: మరో ట్యాబ్ రిలీజ్ చేసిన ఎంఐ.. తక్కువ ధరలో సూపర్ స్పెసిఫికేషన్లు
Redmi Pad Pro
Follow us
Srinu

|

Updated on: Apr 13, 2024 | 4:30 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ట్యాబ్‌లు కూడా ఇంటెళ్లిపాది ఇష్టపడుతున్నారు. ఈ ట్యాబ్‌లు గేమ్స్ ఆడడానికి అనువుగా ఉండడంతో గృహిణులతో పాటు పిల్లలు కూడా అధికంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీలన్నీ స్మార్ట్ ఫోన్లతో పాటు ట్యాబ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా చైనాకు సంబంధించిన  ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన రెడ్ మీ మరో ట్యాబ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రెడ్‌మీ టర్బో 3 పేరుతో ఇటీవల చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్- 2 ఎస్ఓసీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12.1 అంగుళాల 2.5 కే రిజల్యూషన్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉన్నాయి. ఇది మూడు రంగులలో అందుబాటులో ఉంది. అలాగే ప్రత్యేక హ్యారీ పోటర్ ఎడిషన్‌లో కూడా వస్తుంది. ఈ టాబ్లెట్ మూడు ర్యామ్, నిల్వ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది అక్టోబర్ 2022లో భారతదేశంలో ఆవిష్కరించిన రెడ్‌మీ ప్యాడ్‌కు కొనసాగింపుగా లాంచ్ చేశారు.  రెడ్‌మీ టర్బో 3 ట్యాబ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

చైనాలో రెడ్‌మీ ప్రోకు సంబంధించిన 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 1,499 (దాదాపు రూ. 17,300), అయితే 8 జీబీ + 128జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లు సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 18,490, రూ.18,400) వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ టాబ్లెట్ ప్రస్తుతం ఎంఐ, చైనా వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది . ఇది ఏప్రిల్ 15 నుండి విక్రయిస్తారు. రెడ్ ‌మీ ప్యాడ్ ప్రో మూడు రంగుల ఎంపికల్లో అందిస్తారు. గ్రే, షాలో బ్లూ బే, స్మోక్ గ్రీన్ వంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ ప్యాడ్ ప్రో ప్రత్యేక హ్యారీ పోటర్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర సీఎన్‌వై 2,299 (దాదాపు రూ. 26,500). ఇది 8 జీబీ + 256 జీబీ నిల్వతో వస్తుంది.

రెడ్‌మీ ప్యాడ్ ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు

రెడ్‌మీ ప్యాడ్ ప్రో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 12.1 అంగుళాల 2.5 కే(2,560 x 1,600 పిక్సెల్‌లు) రిజల్యూషన్ ఎల్‌సీడీ స్క్రీన్, 180 హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 240 హెచ్‌జెడ్ పెన్ (స్టైలస్) టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 600 నిట్‌ల గరిష్ట ప్రకాశం స్థాయిని, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ పొందుతుంది. రెడ్ ‌మీ ప్యాడ్ ప్రో 7 ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ఆధారంగా పని చేస్తుంది. ఈ ట్యాబ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1.5 టీబీ వరకు విస్తరించవచ్చు. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ ద్వార వస్తుంది. రెడ్‌మి ప్యాడ్ ప్రో వెనుకవైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ట్యాబ్  33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతుతో నాలుగు స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..