భారతదేశంలో ప్రతి ఒక్కరి గుర్తింపునకు ఆధార్ కార్డు ఎంతో కీలకం. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూఐడీఏఐ అందరికీ జారీ చేస్తోంది. అయితే ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐలు) పరిస్థితి ఏమిటి? వారు ఆధార్ కార్డు పొందే అవకాశం ఉందా? ఆ వివరాలు పరిశీలిస్తే.. ఎన్ఆర్ ఐలు కూడా ఆధార్ కార్డును పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రత్యేక దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల సవరించిన నిబంధనల ప్రకారం.. భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగిన ఎన్‌ఆర్‌ఐలు దేశానికి వచ్చిన తర్వాత ఆధార్‌ను పొందేందుకు అనుమతి ఉంది.
విదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయినా వారు పొందే అవకాశం ఉంది. దీనిని పొందడం వల్ల భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత లేదా బ్యాంకింగ్, ఆస్తి. అద్దె, ప్రభుత్వ లావాదేవీలు, ఎక్కువ కాలం బస చేయడం తదితర అనేక పనులకు ఉపయోగపడుతుంది.
2019 జూలై లో ఆధార్ చట్టానికి సవరణలు చేశారు. ఆ ప్రకారం భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు దేశానికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డులను పొందవచ్చు. కార్డు కావాాలంటే 182 రోజుల పాటు దేశంలో నివసించాలన్న గత నిబంధనను తొలగించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐI) ఇటీవల దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించింది. ఎన్ఆర్ఐ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త నమోదు ఫారాలను ప్రవేశపెట్టింది.
ఎన్ఆర్ఐల కోసం దరఖాస్తు ఫారాలను సవరించారు. వాటిని నివాసితులు, ఎన్‌ఆర్‌ఐలకు వేర్వేరుగా కేటాయించారు. పెద్దలు, పిల్లలు, విదేశీ పౌరుల కోసం నమోదు ఫారాలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియలో స్పష్టత, సామర్థ్యాన్ని పెంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. దేశంలో ఆధార్ కార్డులను కోరుకునే ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫారాలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రవేశపెట్టింది. ఇవి ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి.
ఎన్ఆర్ఐలు తప్పనిసరిగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వారికి ఆన్ లైన్ విధానంలో అవకాశం లేదు. ఈ ప్రక్రియలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, అవసరమైన డాక్యుమెంట్లు అందించడం, బయోమెట్రిక్ డేటా సేకరణ చేయడం వంటివి ఉంటాయి. 90 రోజుల లోపు దరఖాస్తుదారుడి చిరునామాకు ఆధార్ కార్డ్ పంపిస్తారు.
ఎన్ఆర్ఐలు ఆధార్ తప్పనిసరి కానప్పటికీ, ఇది భారతదేశంలోని వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తుంది. గుర్తింపును సూచిస్తుంది, పౌరసత్వం మాత్రం కాదు. అసలు కార్డు అందుబాటులో లేకుంటే ఈ-ఆధార్ లేదా ఎం-ఆధార్ ను ఉపయోగించవచ్చు. సూచించిన దశలను అనుసరించడం, అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వడం ద్వారా ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డును పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..