జీమెయిల్ స్పేస్ ఫుల్ అయ్యిందా? ఒక్క క్లిక్‌తో మెయిల్స్‌ని ఇలా క్లీన్ చేసేయండి
Gmail Storage.. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ నిండిపోయినప్పుడు వెంటనే డబ్బులు చెల్లించి ప్లాన్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాలు కేటాయించి మీ ఇన్‌బాక్స్‌ను క్లీన్ చేసుకోవడం ద్వారా భారీగా స్పేస్‌ను ఖాళీ చేసుకోవచ్చు. ముఖ్యంగా పాత ఈమెయిల్స్, అనవసరమైన అటాచ్‌మెంట్‌లను తొలగించడం ద్వారా మొబైల్ లేదా సిస్టమ్‌లో మెమరీ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

ఏండ్ల తరబడి జీమెయిల్ వాడుతున్న వారిలో చాలా మంది స్టోరేజ్ సమస్యను ఎదుర్కొంటుంటారు. ఫొటోలు, ఫైళ్లతో పాటు ఇన్‌బాక్స్‌లో నిండిపోయే మెయిల్స్ కూడా మెమరీని విపరీతంగా ఆక్రమిస్తాయి. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అనవసరమైన డేటాను తొలగించి మీ గూగుల్ అకౌంట్‌లో తగినంత స్థలాన్ని ఎలా తిరిగి పొందవచ్చో తెలుసుకుందాం.
క్లీన్ అప్ స్పేస్
జీమెయిల్‌లో స్టోరేజ్ సమస్య ఎక్కువగా పెద్ద అటాచ్‌మెంట్‌లు ఉన్న ఈమెయిల్స్ వల్ల వస్తుంది. జీమెయిల్ యాప్‌లోని క్లీన్ అప్ స్పేస్ ఫీచర్‌ను ఉపయోగించి భారీ ఫైళ్లను గుర్తించి సులభంగా తొలగించవచ్చు. అలాగే సెర్చ్ బార్‌లో హ్యాష్ అటాచ్‌మెంట్ లార్జర్ దాన్ ఫైవ్ ఎంబీ వంటి కమాండ్స్ ఉపయోగించి పాత మెయిల్స్‌ను మాన్యువల్‌గా డిలీట్ చేయడం ద్వారా మరిన్ని గిగాబైట్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
ప్రమోషనల్ మెయిల్స్ తొలగింపు
ఇన్‌బాక్స్‌లో పేరుకుపోయే ప్రమోషనల్ మెస్సేజ్‌లు, సోషల్ నోటిఫికేషన్‌లు పెద్దగా స్పేస్ తీసుకోకపోయినా ఇన్‌బాక్స్ గందరగోళానికి గురిచేస్తాయి. ప్రమోషన్స్ ట్యాబ్‌లోకి వెళ్లి పాత మెసేజ్‌లను ఒకేసారి సెలెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు. అలాగే మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్ ఆప్షన్ ద్వారా ఎవరెవరి నుంచి వార్త ఉత్తరాలు వస్తున్నాయో తెలుసుకొని అనవసరమైన వాటికి అన్‌సబ్‌స్క్రైబ్ కావడం ద్వారా భవిష్యత్తులో స్టోరేజ్ సమస్య పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.
