Digilocker: డీజిలాకర్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జోడించడం ఎలా..? దీని వల్ల ఉపయోగం ఏమిటి?

Digilocker: డిజిటల్ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం డిజిలాకర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇది దేశంలోని పౌరులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను భౌతిక కాగితాల ఇబ్బంది..

Digilocker: డీజిలాకర్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జోడించడం ఎలా..? దీని వల్ల ఉపయోగం ఏమిటి?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 27, 2022 | 6:07 PM

Digilocker: డిజిటల్ ఇండియా చొరవతో భారత ప్రభుత్వం డిజిలాకర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇది దేశంలోని పౌరులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను భౌతిక కాగితాల ఇబ్బంది లేకుండా డిజిటల్‌ (Digital)గా సురక్షితమైన రూపంలో నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. డిజిలాకర్ (Digilocker) పత్రాలను ప్రతిచోటా తీసుకెళ్లాల్సిన అవసరం అనేది తప్పుతుంది. ఇక మన వద్ద ఉండే డాక్యుమెంట్లలో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ (Driving License). వాహనం తీసుకుని బయటకు వెళ్లామంటే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్‌ పోలీసులు నిలుపుతారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేయడంతో డ్రైవింగ్ లైసెన్స్‌, ఇతర పత్రాలు తప్పనిసరి ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉండకపోతే భారీ చలాన్లకు దారి తీస్తుంది. అందుకే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ని డిజిలాకర్‌లో ఎలా స్టోర్ చేసుకోవచ్చో మేము మీకు తెలియజేస్తాము.

డిజిలాకర్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి. మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చే OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) నమోదు చేయాలి. దీని తర్వాత మీరు ఖాతా కోసం వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు. మీరు MPINని కూడా సెట్ చేయవచ్చు. ఇది భవిష్యత్తులో లేదా మీరు మీ డాక్యుమెంట్‌లను చాలా త్వరగా సోర్స్ చేయాల్సిన కొన్ని సందర్భాల్లో ఫాస్ట్ లాగిన్‌ని సులభతరం చేస్తుంది.

డిజిలాకర్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎలా జోడించాలి:

☛ మీ ఖాతాను సృష్టించిన తర్వాత మీ డిజిలాకర్ ఖాతాతో మీ ఆధార్ కార్డ్‌ని లింక్ చేయండి.

☛ ఇక్కడ మీరు యాప్‌లోని ‘పుల్ పార్ట్‌నర్స్ డాక్యుమెంట్స్’ విభాగాన్ని యాక్సెస్ చేయాలి. ఈ విభాగంలో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయవచ్చు.

☛ ‘పుల్ డాక్యుమెంట్’ని ఎంచుకున్న తర్వాత, మీరు పత్రాన్ని ఎవరి ఏ విభాగంలో ఉంచాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు..ఇది రహదారి, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు సంబంధించినది ఉంటుంది.

☛ డాక్యుమెంట్ టైప్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ గుర్తించి దానిపై నొక్కండి.

☛ మీరు మీ పేరు, చిరునామాతో సహా అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత, పత్రాన్ని సేకరించి యాప్‌లో నిల్వ చేస్తుంది. ప్రతి యాప్ వినియోగదారు వారి పత్రాలను నిల్వ చేయడానికి 1 GB స్టోరేజీ పొందుతారు.

☛ డిజిలాకర్ ద్వారా చూపించిన పత్రాలు సరైనవిగా గుర్తించాలని, ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ కోసం ఉపయోగించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పుడు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

Aadhaar History: మీ ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలా..? ఇలా చేయండి..!

Whatsapp: మొబైల్‌లో నంబర్ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ మెసేజ్‌ చేయడం ఎలా..?