నట్లు, బోల్ట్‌లు లేని ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రతి రోజు రాత్రి 12 గంటలకు క్లోజ్ చేసే ఈ సస్పెన్షన్‌ బ్రిడ్జీ ఎక్కడ ఉందో తెలుసా..

|

Jun 14, 2023 | 11:16 AM

Howrah Bridge Fact: కోల్‌కతాలోని హౌరా వంతెన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిపై నిర్మించిన కాంటిలివర్ వంతెన. హౌరా వంతెన ప్రతి రాత్రి 12 గంటలకు కొంత సమయం పాటు మూసివేయబడుతుంది. కారణం ఏంటో తెలుసా..

నట్లు, బోల్ట్‌లు లేని ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రతి రోజు రాత్రి 12 గంటలకు క్లోజ్ చేసే ఈ సస్పెన్షన్‌ బ్రిడ్జీ ఎక్కడ ఉందో తెలుసా..
Howrah Bridge
Follow us on

Howrah Bridge:‘యమహా నగరి కలకత్తా పురి.. నమహో హుగిలీ హౌరా వారధి‘.. చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది’ నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట.. అంటూ వేటూరి సాహిత్యం..  తెలుగు జనం మదిని తట్టిన చిరంజీవి పాట మనకు గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు.. ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా.. అవును, ” నమహో హుగిలీ హౌరా వారధి” గురించి మనలో చాలా మందికి తెలియని విశేషాల ఇందులో ఉన్నాయి. కోల్‌కతా నగర అందాలను అందరూ ఇష్టపడతారు. విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఈ నగరాన్ని చాలా ఇష్టపడతారు. నగరంలో ఆకర్షణీయమైన కేంద్రంగా ఉన్న అటువంటి స్మారక చిహ్నాలు ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కోల్‌కతాకు వెళ్లి ఉంటే లేదా దాని గురించి కొంత వెతికితే, మీరు హౌరా బ్రిడ్జ్ గురించి విని ఉంటారు. ఈ వంతెన చాలా అందంగా ఉంటుంది. కానీ దానిలో ఒక వింత కూడా దాగి ఉంది. ఈ వంతెనను ప్రతి రోజు రాత్రి 12 గంటలకు మూసివేయబడుతుంది. ఈ వింత వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం.

హౌరా వంతెన మధ్యాహ్నం 12 గంటలకు ఎందుకు మూసివేయబడుతుందో మనం గురించి మనం తెలుసుకోవాలి. కోల్‌కతాలోని హౌరా వంతెన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నదిపై నిర్మించిన కాంటిలివర్ వంతెన. హౌరా వంతెన ప్రతి రాత్రి 12 గంటలకు కొంత సమయం పాటు మూసివేయబడుతుంది. వాస్తవానికి రాత్రి 12 గంటల సమయంలో వంతెన విరిగిపోయే ప్రమాదం ఉందని చుట్టుపక్కల ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు ప్రశ్న ఎందుకు? ఇందులో నిజంగా నిజం ఉందా? సమాధానం ఏంటంటే..

రెండు స్తంభాలపై హౌరా వంతెన..

ఈ వంతెనను బ్రిటిష్ వారు నిర్మించారు. ఇది ఓ మంచి వాస్తుశిల్పానికి ఉదాహరణ. వంతెన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. హౌరా బ్రిడ్జి వద్ద ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు రైళ్లు, కార్లు, పడవలు కొంత సమయం పాటు నిషేధిస్తారు. ఈ సమయంలో ప్రతిదీ ఆగిపోతుంది. వాస్తవానికి, ఈ వంతెనను కేవలం రెండు స్తంభాలపై మాత్రమే నిలిపారు. వంతెన కేవలం 280 అడుగుల ఎత్తులో ఉన్న రెండు స్తంభాలపై ఉంది. ఈ రెండు స్తంభాల మధ్య దూరం ఒకటిన్నర వేల అడుగులు. వంతెనపై ఎక్కువ బరువు ఉంటే, అది కూలిపోవచ్చు.

నట్లు, బోల్ట్‌లు లేకుండానే వంతెన నిర్మాణం..

వంతెనకు నట్లు, బోల్ట్‌లు లేవు. అయితే మొత్తం నిర్మాణాన్ని రివర్ట్ చేయడం ద్వారా ఏర్పడింది. ఇది 26,500 టన్నుల ఉక్కును వినియోగించారు. అందులో 23,000 టన్నుల హై-టెన్సైల్ అల్లాయ్ స్టీల్‌ను టిస్క్రోమ్ అని పిలుస్తారు. దీనిని టాటా స్టీల్ సరఫరా చేసింది. ప్రధాన టవర్ 55.31 m × 24.8 m కొలతలు కలిగిన ఒకే ఏకశిలా కైసన్‌లతో 21 షాఫ్ట్‌లతో, ఒక్కొక్కటి 6.25 మీటర్ల చదరపుతో నిర్మించబడింది.

వంతెన నిర్మించిన ఇంజనీర్లు ఏం చెప్పారంటే..

పిల్లర్లు ఎప్పుడైనా పడిపోతే 12 గంటలకే పడిపోతాయని ఈ వంతెన నిర్మించిన ఇంజనీర్లు చెప్పారు. బ్రిడ్జి కట్టిన తర్వాత ఇంజినీర్లు చెప్పిన మాట ఇది. ఈ కథ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. కోల్‌కతా వెళితే అక్కడ కూడా వినవచ్చు.

వారధి గురించి మరిన్ని విశేషాలు..

హౌరా బ్రిడ్జి అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన ఈ బ్రిడ్జి పేరు న్యూ హౌరా బ్రిడ్జి. ఎందుకంటే.. ఇది హౌరా, కోలకతా రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ, ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. అయితే ఇది ఇప్పటికీ ప్రముఖంగా హౌరా బ్రిడ్జి అనే పేరుతోనే పిలవబడుతుంది.

మరిన్ని హ్యైమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం..